వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5500 నుంచి 9429కి : బీహార్ రాష్ట్రంలో హఠాత్తుగా పెరిగిన కరోనా మరణాలు, ఏం జరిగిందంటే..?

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణాలపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణాల సంఖ్యను భారీగా పెంచడం గమనార్హం. కోర్టు మొట్టికాయలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో బీహార్ సర్కారు ఎట్టకేలకు వాస్తవ మరణాల సంఖ్యను వెల్లడించింది.

Recommended Video

Viral Video.. పక్షులపై ఏనలేని ప్రేమ చూపిస్తున్న ఓ వ్యక్తి కథ !
బీహార్‌లో ఆరు రేట్లు.. 72 శాతం పెరిగిన మరణాలు

బీహార్‌లో ఆరు రేట్లు.. 72 శాతం పెరిగిన మరణాలు

బీహార్ రాస్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 9429 మంది మరణించారని తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇది గతంలో ఆరోగ్యశాఖ వెల్లడించిన లెక్కల కంటే ఎక్కువగా ఉండగటం గమనార్హం. అంతకుముందు బీహార్ రాస్ట్రంలో 5500 మంది కరోనాతో మరణించారని పేర్కొంది. తాజాగా, ఈ సంఖ్యకు 3951 మంది మరణించారని జత చేసింది. 2020 మార్చి నుంచి 2021 మార్చి వరకు కరోనా మరణాలు 1,600 కాగా, కేవలం ఏప్రిల్ నెల నుంచి జూన్ 7వ తేదీ మధ్య కాలంలోనే 7,775 మరణాలు సంభవించాయని బీహార్ ఆరోగ్యశాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది. దీన్ని బట్టి చూస్తే కేవలం రెండు నెల్లోనే ఆరు రేట్ల మరణాలు నమోదయ్యాయని తెలుస్తోంది. మొత్తం జిల్లాలను పరిశీలించాక 72 శాతం మరణాల పెరుగుదలతో ఆరోగ్యశాఖ సమర్పించిన నివేదికపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

అందుకే కరోనా మరణాల లెక్కల్లో గందరగోళం..

అందుకే కరోనా మరణాల లెక్కల్లో గందరగోళం..

రాష్ట్రంలోని 38 జిల్లాలకు గానూ రాజధాని పాట్నాలో 2303 మంది చనిపోయారని రివైజ్ లెక్కల్లో చూపించారు. ఇక ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో 222 మరణాలు నయోదయ్యాయి. ఒక ప్రాంతంలో వాళ్లు మరో ప్రాంతంలో కరోనా చికిత్స తీసుకుని చనిపోవడం వల్లే ఈ లెక్కల్లో గందరగోళం ఏర్పడిందని ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ప్రత్యాయ్ అమ్రిత్ పేర్కొన్నారు.

రికవరీ కూడా తగ్గింది.. అన్ని రాష్ట్రాల్లోనూ..

రికవరీ కూడా తగ్గింది.. అన్ని రాష్ట్రాల్లోనూ..

ఇది ఇలావుంటే, తాజా గణాంకాల్లో రికవరీలను కూడా తగ్గించి చూపడం గమనార్హం. ఇప్పటి వరకు 98 శాతంగా ఉన్న రికవరీని 97 శాతానికి తగ్గించింది. అధికారిక అంత్యక్రియల సంఖ్య 3243 ఉండటం గమనార్హం. అయితే, ఒక్క బీహార్ రాష్ట్రంలోనే కాదు, దేశంలోని మిగితా రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.

పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ వేళ..

పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ వేళ..


మరోవైపు, బీహార్ రాజధాని పాట్నాలోని ఎయిమ్స్‌లో 2-18 ఏళ్ల పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల నుంచి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఫలితాలను వెల్లడవుతాయని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఓ వైపు కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో హఠాత్తుగా మరణాల సంఖ్య పెరగడం చర్చనీయాంశంగా మారింది.

English summary
Patna’s All India Institute of Medical Sciences (AIIMS) will be holding press conference on Thursday with regard to clinical trial on children aged between 2-18 years. Last week, AIIMS Patna had started the pediatric trials for the COVID-19 vaccine manufactured by the Bharat Biotech, Covaxin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X