దేశ రాజధానిలో కూలిన పాత భవనం: 9 ఏళ్ల చిన్నారితోపాటు నలుగురు మృతి, శిథిలాల్లో మరికొందరు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని బవానా ప్రాంతంలో శుక్రవారం నాలుగు అంతస్తుల భవనం కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో తొమ్మిదేళ్ల బాలిక కూడా ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురిలో కనీసం ముగ్గురిని రక్షించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
మృతులను రుకయ్య ఖాతున్, షాజాద్, అఫ్రీనా (9), డానిష్‌లుగా గుర్తించారు. దేశ రాజధానిలోని బవానాలోని జెజె కమ్యూనిటీలో పురాతన భవనం పడిపోయిందని వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. భవన శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం పోలీసులు, సహాయక బృందాలు రెస్కూ ఆపరేషన్ కోనసాగిస్తున్నాయి.

జేజే కాలనీకి చెందిన ఫాతిమా, షహనాజ్ అనే ఇద్దరు మహిళలను రక్షించి ఆస్పత్రికి తరలించారు. వారిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు' అని ఓ పోలీసు అధికారి మీడిడియాకు తెలిపారు.
ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. సంఘటన శుక్రవారం మధ్యాహ్నం 2.48 గంటలకు జరిగింది. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి నాలుగు ఫైర్ టెండర్లను పంపించారు. 300-400 యూనిట్లు కలిగిన రాజీవ్ రతన్ ఆవాస్ యోజనలో కూలిపోయిన నిర్మాణం భాగమని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) బ్రిజేందర్ కుమార్ యాదవ్ తెలిపారు.
"వెంటనే మూడు జేసీబీలు, ఒక హైడ్రా, రెండు అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయని బ్రిజేందర్ కుమార్ యాదవ్ తెలిపారు.
ఇదే విధమైన సంఘటనలో, గురువారం, గురుగ్రామ్‌లోని సెక్టార్ 109లోని చింటెల్స్ ప్యారడిసో హౌసింగ్ కాంప్లెక్స్ డి టవర్ ఆరవ అంతస్థు పైకప్పు ఒక భాగం పడిపోయింది, ఒక మహిళ మృతి చెందింది. ఇద్దరు వ్యక్తులు శిథిలాల క్రింద చిక్కుకున్నారు.












Click it and Unblock the Notifications