బచ్చా గ్యాంగ్: పోలీసునే దోచుకున్న 9ఏళ్ల బాలిక, రూ.4 లక్షలతో పరారీ
మధుర: తొమ్మిదేళ్ల బాలిక ఓ పోలీసుకే టోకరా వేసి, నాలుగు లక్షల రూపాయలతో ఉడాయించిన సంఘటన బుధవారం మథురలోని కోటావ్లీ ప్రాంతంలో జరిగింది. పోలీసు కానిస్టేబుల్ దగ్గర్నుంచి దర్జాగా రూ 4 లక్షలు దోచుకు వెళ్లింది. కానిస్టేబుల్ విజయ్ పాల్ సింగ్, తన కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం, బుధవారం చౌకీ బాగ్ వద్దనున్న బ్యాంకులో రూ 4.02 లక్షలు డ్రా చేసుకున్నాడు.
అతడు బయటికి రాగానే, ఓ బాలిక అతడి ప్యాంట్‌పై మురికి ఉందని, శుభ్రం చేసుకోవాలని చెప్పింది. దాంతో విజయ్‌పాల్ డబ్బుల సంచీని కింద పెట్టి ప్యాంట్‌ను చూసుకోసాగాడు. అంతే కేవలం లిప్త కాలంలో ఆ బాలిక డబ్బుల బ్యాగ్‌తో మాయమైపోయింది. దీంతో ఆ కానిస్టేబుల్ లబోదిబోమంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మధురలో ఇటీవలి కాలంలో బచ్చా గ్యాంగ్ (పిల్లల ముఠా)లు పెచ్చుమీరిపోయాయని, పిల్లలు విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడుతున్నారని, త్వరలోనే వారి ఆట కట్టిస్తామని పోలీసులు చెబుతున్నారు. తొమ్మిదేళ్ల బాలికను ఆ బచ్చా గ్యాంగ్ సభ్యురాలిగా అనుమానిస్తున్నారు.
విజయపాల్ సింగ్ ఆగ్రాలో విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబం మాత్రం ఔరంగాబాదులో ఉంటోంది. పక్షం రోజుల్లో కూతురి పెళ్లి జరగాల్సిన స్థితిలో డబ్బు దోపిడీకి గురికావడంతో విజయ్ పాల్ సింగ్ దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications