దారుణం: వృద్ధుడిని గొడ్డలితో నరికి సజీవ దహనం చేశాడు

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో గుడికి వెళుతున్న ఓ దళిత వృద్ధుడిపై గొడ్డలితో దాడి చేసి సజీవ దహనం చేసిన సంఘటన కలకలం సృష్టించింది. ఈ సంఘటన జలౌన్ జిల్లా హమీర్‌పూర్‌లో చోటు చేసుకుంది.

పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం చిమ్మ (90) అనే దళిత వృద్ధుడు తన భార్య, తమ్ముడుతో పాటు కుమారుడు దుర్జన్‌తో కలిసి బుధవారం హమీర్‌పూర్‌‌కు సమీపంలో ఉన్న మైదానీ బాబా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

ఆలయంలోకి వెళ్లే క్రమంలో అతడిని సంజయ్ తివారీ అనే వ్యక్తిఅడ్డుకున్నాడు. అయితే సంజయ్ మాటలను లెక్కచేయని చిమ్మా ముందుకు కదిలాడు. దీంతో రెచ్చిపోయిన సంజయ్ గొడ్డలితో నరికి, ఆపై నిప్పంటించాడు. ఆలయంలోని ఉన్న భక్తులందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది.

 90-yr-old Dalit man burnt alive for trying to enter temple in UP

దీంతో వెంటనే ఆలయంలోని భక్తులు కొంతమంది సంజయ్ తివారిని బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మద్యం మత్తులో ఉన్న తివారీ చిమ్మాతో పాటు ఇంకా చాలామంది భక్తులను గుడిలోకి వెళ్లొద్దంటూ వారించినట్లు తెలిపాడు.

చాలా మంది తిరస్కరించారు. అప్పటికే కోపంతో ఉన్న తివారీ చివరకు ఆ వృద్ధుడు కూడా తనను లెక్కచేయలదేని అతడిపై దాడిచేశాడు. ఆ సమయంలో అతని పక్కనే ఉన్న భార్య సాయం కోసం కేకలు పెట్టినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తివారీ మరితంగా రెచ్చిపోయి, చిమ్మపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

దీంతో చిమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సంజయ్ తివారీని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+