ఏంటా టెక్నిక్? 2శాతం మందికే తెలియడమేంటి? : ఇండియన్స్ 'జీరో నాలెడ్జ్'
న్యూఢిల్లీ : 'హార్ట్ ఎటాక్..' అకస్మాత్తుగా వచ్చే ఈ నొప్పికి తక్షణం ప్రాథమిక చికిత్స అందించగలిగితే నొప్పి తీవ్రతను తగ్గించి సదరు హృద్రోగి ప్రాణాలు కాపాడవచ్చు. అయితే నివ్వెరపోవాల్సిన విషయమేంటంటే.. ఇండియాలో 98శాతం జనాభాకు అసలు హార్ట్ ఎటాక్ వచ్చిన సమయంలో ఎలాంటి టెక్కిక్ లు ఉపయోగించాలో తెలియకపోవడం.
అంటే.. పక్కనున్న వ్యక్తికి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఎలా స్పందించాలనే విషయంలో ఇండియన్స్ లో ఉన్న అవగాహన జీరో అన్నమాట. ఇదేదో అంచనా కొద్ది చెబుతోన్న లెక్క కాదు, లిబ్రేట్ సంస్థ సర్వేలో వెల్లడైనా విషయాలు. దేశంలోని 20 నగరాల్లో ఉన్న 25లక్షల మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించింది లిబ్రేట్. వయసు మళ్లినవారి సంగతి పక్కనబెడితే యువతలోను దీనిపై అవగాహన కొరవడడం ఆందోళన కలిగించే విషయమని లిబ్రేట్ సీఈవో సౌరబ్ అరోరా ఆందోళన వ్యక్తం చేశారు.

హార్ట్ ఎటాక్ సమయంలో ఎంతగానో ఉపకరించే కార్డియోపల్మొనరి రిసక్సిటేషన్ (సీపీఆర్) టెక్నిక్ గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పించాల్సిన అవసరముందని సంస్థ అభిప్రాయపడింది. హార్ట్ ఎటాక్ సంబంధిత కేసుల్లో 60శాతం మంది ఆసుపత్రికి చేరేలోపే ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఇలాంటి టెక్నిక్స్ గురించి ఇండియన్స్ లో అవగాహన ఏర్పరచడం తప్పనిసరి అని సంస్థ పేర్కొంది.












Click it and Unblock the Notifications