నిక్కర్ వేసుకునే వయసు, మైనర్ లవ్ స్టోరీ, అడ్డుపడిన ఫ్యామిలీ మొత్తం ఫినిష్, వీడు ?
ఆ అబ్బాయి వయసు కేవలం 15 ఏళ్లు. కానీ అతను చేసిన పనితో అందరూ హడలిపోయారు. తండ్రి, కన్న తల్లి, అన్నయ్యలను హత్య చేశాడు. కొన్ని రోజులుగా ఆ బాలుడు కుటుంబ సభ్యుల హత్యలకు ప్లాన్ చేస్తున్నాడు. వ్యవసాయానికి ఉపయోగించే పదునైన ఆయుధంతో ఒకేసారి ముగ్గురిని అతికిరాతంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని కుసుమ్హి కళ్యాణ్ గ్రామంలో చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరసటి రోజు కుటుంబ సభ్యులు ముగ్గురిని హత్య చేసిన బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ముగ్గురు కుటుంబ సభ్యుల హత్యలకు గల కారణాలను బాలుడు వెల్లడించడంతో పోలీసులతో పాటు బంధువులు, గ్రామస్తులు హడలిపోయారు.తండ్రి మునీష్ బింద్ (45), తల్లి దేవంతి బింద్ (40), సోదరుడు రామ్ ఆశిష్ బింద్ (20) లను ఆ బాలుడు దారుణంగా హత్య చేశాడని పోలీసులు అన్నారు.

తన కుటుంబాన్ని మొత్తం హత్య చేసిన 15 ఏళ్ల బాలుడు పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. ఈ 15 ఏళ్ల అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని ఆ మైనర్ అబ్బాయి వాళ్ల ఇంట్లో చెప్పాడు. నీకు కేవలం 15 సంవత్సరాల వయస్సు మాత్రమే అని, పెళ్లికి ఇంకా టైమ్ ఉందని అతని తల్లిదండ్రులు, అతని సోదరుడు మైనర్ అబ్బాయికి బుద్దిమాటలు చెప్పారు. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు అతని గర్ల్ ఫ్రెండ్ కు వయస్సు ఎంత అని అడగలేదు.
అంతకు ముందు నీకు 15 ఏళ్లు మాత్రమే వచ్చాయని, నీ ప్రియురాలితో పెళ్లికి ఇంకా సమయం ఉందని, అంతవరకు అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేయాలని తల్లిదండ్రులు, అన్నయ్య ఆ అబ్బాయికి బుద్దిమాటలు చెప్పి మందలించారు.తల్లిదండ్రులు, అన్నయ్య తెలివిగా తన ప్రియురాలితో పెళ్లికి నిరాకరించడం ఈ కుర్రాడి ఎక్కడలేని కోపాన్ని తెచ్చిపెట్టింది. తన పెళ్లికి అడ్డంగా వచ్చిన తండ్రి, తల్లి, అన్నయ్యలను హత్య చేయాలని మైనర్ అబ్బాయి నిర్ణయించుకున్నాడు.
ఆ రోజు నుంచి ప్రతిరోజూ వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్టుకు పదును పెడుతూ హత్యలు చెయ్యడానికి సమయం కోసం వేచి చూశాడు. అన్నయ్య రామ్ ఆశిష్ తో కలిసి మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి మద్యం మత్తులో ఉన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అన్న రామ్ ఆశిష్ తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. అయితే 15 ఏళ్ల బాలుడు మద్యం సేవించి ముగ్గురు కుటుంబ సభ్యుల హత్యకు స్కెచ్ వేశాడు.

అర్దరాత్రి దాటిన తరువాత అందరూ నిద్రిస్తున్న సమయంలో నిద్రలేచిన మైనర్ అబ్బాయి వ్యవసాయానికి ఉపయోగించే పదునైన ఆయుధంతో ముగ్గురి గొంతులు కోసేశాడు.
ముగ్గురి గొంతులు కోసేసిన తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో ముగ్గురు కుటుంబ సభ్యులు ఇంట్లోనే మృతి చెందారు. మరుసటి రోజు బంధువులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి కోసం గాలించిన పోలీసులు చివరికి అతన్ని పట్టుకుని అరెస్టు చేశారు. 15 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని కోరికతో మద్యం మత్తులో కుటుంబ సభ్యులు ముగ్గురిని అతి కిరాతకంగా హత్య చేసిన బాలుడి గురించి తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు షాక్ అయ్యారని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications