షాక్: బెంగళూరులో ఆఫీస్ మీద నుంచి దూకి లేడీ టెక్కీ ఆత్మహత్య
బెంగళూరు: జీవితంపై విరక్తి చెందిన మహిళా టెక్కీ పని చేస్తున్న కార్యాలయం కట్టడం మీద నుంచి కిందకుదూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో జరిగింది. శోభా లక్ష్మినారాయణ (30) అనే యువతి ఆత్మహత్య చేసుకునింది.
వైట్ ఫీల్డ్ లోని హర్యాన్ సాఫ్ట్ వేర్ కంపెనీలో శోభా సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. గురువారం ఎప్పటిలాగే ఆమె కార్యాలయంలోకి వెళ్లింది. తన సీటు దగ్గర వ్యానిటీ బ్యాగ్ పెట్టి కంప్యూటర్ ఆన్ చేసింది.

తరువాత కంపెనీ కార్యాలయంలోని నాలుగవ అంతస్తులోని కాఫీ, టీ ఏరియాలోకి వెళ్లింది. ఆ సమయంలో ఒక్క సారిగా నాలుగవ అంతస్తు మీద నుంచి శోభా కిందకు దూకేసింది. తీవ్రగాయాలైన శోభా మరణించిందని పోలీసులు చెప్పారు.
శోభా కాఫీ, టీ ఏరియాలోకి వెలుతున్న సమయంలో మేము చూశామని, టీ తాగడానికి వెలుతుందని తాము భావించామని సాటి ఉద్యోగులు చెప్పారు. మండ్యకు చెందిన శోభా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులోనే నివాసం ఉంటున్నదని పోలీసులు తెలిపారు. ప్రేమ విషయంలో శోభా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని వైట్ ఫీల్డ్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications