ముగ్గురు ఆడబిడ్డలు, మరో బిడ్డ వద్దని భార్య, మగబిడ్డను కనలేదని భర్త ఏం చేశాడంటే !
బెంగళూరు: మగబిడ్డను కనలేదని సహనం కోల్పోయిన భర్త భార్యను అతిదారుణంగా హత్య చేసి పారిపోయిన ఘటన కర్ణాటకలోని కోలారు జిల్లా మాలూరు తాలుకా దొడ్డకడతురు గ్రామంలో జరిగింది. భర్యను హత్య చేసిన విజయ్ కుమార్ చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు.
విజయ్ కుమార్, మంజులకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన వంశం నిలబడాలంటే మగపిల్లాడు కావాలని విజయ్ కుమార్ నిత్యం భార్యను వేదించేవాడు. కూలిపని చేస్తున్న మనం ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలను పోషిస్తున్నామని ఇక మరో బిడ్డ వద్దని మంజుల చెప్పింది.

ప్రతి నిత్యం మగబిడ్డను కనలేదని భార్య మంజులతో విజయ్ కుమార్ గడొవ పడుతున్నాడు. ఈ విషయంలో ఇంటిలో దంపతులు ఇద్దరూ గొడవపడ్డారు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన విజయ్ కుమార్ కత్తి తీసుని భార్యను అతిదారుణంగా పోడిచి పరారైనాడు.
మంజుల కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మంజుల మరణించిందని వైద్యులు చెప్పారు. కోలారు జిల్లా ఎస్పీ దివ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. మాలారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications