వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోండా ఆక్టివా అంటూ.. రూ.లక్ష కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

|
Google Oneindia TeluguNews

ఇటివల ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోళ్లు అమ్మకాలు పెరుగుతుండగా మరోవైపు అదే అదనుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. డమ్మి వాహనాలతో కొనుగోలు దారులను బురిడికొట్టించి డబ్బులు కాజేస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలోనే అన్‌లైన్ వ్యాపారం తోపాటు సాంకేతికపై పూర్తి అవగాహన లేని వినియోగదారులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఆర్ధికంగా నష్టపోతున్నారు.ఈ నేపథ్యంలోనే హూండా అక్టీవా కొనుగోలు చేయబోయిన మరో కొనుగోలుదారుడు సైబర్ నేరగాళ్ల మాయపడ్డాడు.

25వేలకే హుండా ఆక్టివా అంటూ బురిడి

25వేలకే హుండా ఆక్టివా అంటూ బురిడి

ముంబాయి ఖేర్ ప్రాంతంలో నివసిస్తున్న 36 సంవత్సరాల ఓ డ్రైవర్ ఆన్‌లైన్‌లో 25వేలకు హోండా అక్టీవా అమ్మకానికి ఉండడంతో ,దాన్ని కొనుగోలు చేసేందుకు సంబంధిత నెంబర్‌లో కాంటాక్టు చేశాడు. దీంతో అవతలి వ్యక్తి తనకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని అందుకే 25 వేలకే స్కూటర్ అమ్ముతున్నట్టు తెలిపాడు. మరోవైపు స్కూటర్ కోసం చాల మంది కాంటాక్ట్‌లో ఉన్నారని ముందుగా 15 వేల రుపాయలు చెల్లిస్తే తాను స్కూటర్‌ను పంపిస్తానని తెలిపాడు.

97 వేలు కోల్పోయిన కొనుగోలుదారుడు

97 వేలు కోల్పోయిన కొనుగోలుదారుడు

దీంతో అమ్మకం దారుడు చెప్పినట్టుగా రూ.15వేలను కొనుగోలుదారుడు సెప్టెంబర్ 3న తాను చెప్పిన అకౌంట్‌ నంబర్‌కు పంపించాడు. అనంతరం మరో వ్యక్తి లైన్‌లోకి వచ్చి తాను ట్రాన్స్‌పోర్టు నుండి మాట్లాడుతున్నాని, స్కూటర్ డెలివరికి సిద్దంగా ఉందని చెప్పాడు. దీంతో ట్రాన్స్‌పోర్టు ఖర్చుల క్రింద 5వేల రుపాయలు పంపించాలని కొరాడు. దీంతో ట్రాన్స్‌పోర్టు కోసం కూడ 5వేలు పంపించాడు.ఇక మరోసారి అసలు అమ్మకం దారుడు ఫోన్ చేసి మరో 7వేల రుపాయలు ఇస్తేనే స్కూటర్ పంపిస్తానని చెప్పడంతో చేసేదేమి లేక డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు.

లింకును పంపి 70వేలు మాయం

లింకును పంపి 70వేలు మాయం

అయితే ఎంతకి స్కూటర్ రాకపోవడంతో విసిగిపోయిన కొనుగోలుదారుడు తన డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో తాను డబ్బులు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నానని నమ్మించిన సైబర్ మోసగాడు అందుకోసం ఓ లింకును పంపించాడు. దీన్ని క్లిక్ చేయడం ద్వార డబ్బులు పంపిస్తానని నమ్మించాడు. దీంతో అసలు విషయం తెలియని కొనుగోలుదారుడు, తన ఖాతా వివరాలతో కూడ లింక్‌ను క్లిక్ చేశాడు. ఇంకేముంది కొనుగోలు దారుడి ఖాతాలో ఉన్న 70 వేల రుపాయలను సైబర్ నేరగాళ్లు మాయం చేశాడు.

English summary
A 36-year-old man who tried to buy a second hand Activa scooter for Rs 25,000 online, was tricked into paying Rs 97,000 by a cyber-fraudster. An FIR was registered at the Khar police station on September 6.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X