వృద్దురాలి కాళ్లు చేతులు కట్టి అత్యాచారం: దేహశుద్ది
బెంగళూరు: తాగడానికి నీళ్లు కావాలని చెప్పిన కామాంధుడు వృద్దురాలి మీద పదేపదే అత్యాచారం చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది. వృద్దురాలి మీద అత్యాచారం చేసిన మణికంఠ (26) అనే కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరులోని మాగడి రోడ్డులోని తావరకెరె దగ్గర ఉపకార్ లేఔట్ ఉంది. ఈ లేఔట్ లో 76 సంవత్సరాల వృద్దురాలు నివాసం ఉంటున్నారు. ఈమె పిల్లలు బెంగళూరు నగరంలోని వివిద చోట్ల నివాసం ఉంటున్నారు. ఈమె ఒక్కరే గత 5 సంవత్సరాల నుండి ఒంటరిగా నివాసం ఉంటున్నారు.
మణికంఠ అదే ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో మణికంఠ వృద్దురాలి ఇంటి దగ్గరకు వెళ్లాడు. తాగడానికి నీళ్లు కావాలని చెప్పాడు. ఆమె కిటికి తీసి చూసింది. మణికంఠ నీళ్లు కావాలని అడిగాడు.

నీళ్లు ఇవ్వడానికి ఆమె నిరాకరించి కిటికి వేసేశారు. తరువాత గట్టిగా పదేపదే నీళ్లు కావాలని అతను కేకలు వేశాడు. భయపడిన వృద్దురాలు తలుపు తీసి పక్కింటిలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో కామాంధుడు ఆమెను ఇంటిలోకి ఈడ్చుకు వెళ్లాడు.
ఆమె నోటిలో బట్టలు కుక్కి కాళ్లు చేతులు కట్టి వేశాడు. తరువాత ఆమె మీద అత్యాచారం చేశాడు. బుధవారం వేకువ జామున మూడు గంటల వరకు పదేపదే అత్యాచారం చేశాడు. తరువాత ఆమె కట్లు విప్పుకుని కేకలు వేసింది. చిక్కిపోతామని మణికంఠ బయటకు వచ్చాడు.
ఇంటి నుండి బటకు వచ్చిన కామాంధుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే కేకలు వినపడటంతో స్థానికులు బయటకు వచ్చి వెంటాడి మణికంఠను పట్టుకుని చితకబాదారు. ముఖం చిట్లిపోయేటట్లు దాడి చేసి తావరకెరె పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని కేసు దర్యాప్తలో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications