విలాసవంతమైన అపార్ట్ మెంట్, అర్ల్నీమార్నింగ్ 21 అంతస్తు నుంచి కిందపడిన టెక్కీ !

బాగా చదువుకున్న ఓ యువకుడు ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా మంచి ఉద్యోగం సంపాధించాడు. ఒకే సిటీలో కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నా ఆ టెక్కీ మాత్రం విలాసవంతమైన అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని ప్రత్యేకంగా నివాసం ఉంటున్నాడు. మంచి జీతం తీసుకుంటున్న ఆ టెక్కీకి ఏం జరిగిందో ఏమో కాని 21వ అంతస్తు మీద నుంచి కిందకుపడిపోయాడు.

ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విలాసవంతమైన అపార్ట్‌మెంట్ 21వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరు సిటీలోని బెల్లందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బెంగళూరులోని సర్జాపూర్‌ రోడ్డులోని జైన్‌ హైట్స్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సారంగ్‌ కులకర్ణి అలియాస్ సారంగ్ (29) అనే యువకుడు మృతి చెందాడని పోలీసు అధికారులు తెలిపారు.

A Bengaluru techie who committed suicide by jumping from the 21st floor of an apartment.

తెల్లవారుజామున 4 గంటలకు సారంగ్ అతని ఫ్లాట్ రూమ్ నుంచి బయటకు వచ్చి కొంత సేపు బయట నిలబడ్డాడని తెలిసింది. తరువాత 21వ అంతస్తు నుంచి సారంగ్ కిందకు దూకేశాడు. వెంటనే విషయం గుర్తించిన అపార్ట్ మెంట్ భద్రతా సిబ్బంది (సెక్యూరిటీ గార్డులు) అతడిని రక్షించేందుకు వెళ్లారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో సారంగ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

కర్ణాటకలోని ధారవాడకు చెందిన సారంగ్ బెంగళూరు చేరుకుని బెల్లందూరు సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సారంగ్ తల్లిదండ్రులు బెంగళూరులోని జీవన్ భీమా నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే సర్జాపూర్‌ రోడ్డులోని జైన్‌ హైట్స్‌ అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్‌ అద్దెకు తీసుకున్న సారంగ్ తల్లిదండ్రులకు దూరంగా విడిగా ఉంటున్నాడు.

సారంగ్ తన ఫ్లాట్ గదిపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సరైన కారణాలు తెలియరాలేదు. వ్యక్తిగత విషయంగా సారంగ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఉండొచ్చు అని పోలీసు అధికారులు అంటున్నాు. అయితే సారంగ్ గదిలో ఎలాంటి డెత్ నోట్ లభించలేదని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+