ఆంధ్రా-కర్ణాటక బార్డర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే అరెస్టు, రెండు కేసుల్లో జంప్ జిలాని
ఆంధ్రప్రదేశ్‌కు పారిపోతున్న బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మునిరత్న అలియాస్ మునిరత్న నాయుడును కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య చేస్తానని బెదిరించారని, కుల దూషణల నేపథ్యంలో బెంగళూరులోని వయ్యాలికావెల్ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇదే కేసుల్లో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను పోలీసులు అరెస్టు చేశారు.
కోలార్ పోలీసుల సహాయంతో ములబాగిలు తాలూకాలోని నంగలి (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు) సమీపంలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను అరెస్టు చేశారు. కోలార్ మార్గం మీదుగా ఆంధ్రప్రదేశ్ పారిపోవడానికి ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను బెంగళూరు పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ మేరకు కోలారు ఎస్పీ నిఖిల్ సమాచారం అందించారు. తప్పించుకోవడానికి బేసిక్ మొబైల్ కొన్న మునిరత్న కొత్త నంబర్‌ను ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నం చేశారని పోలీసులు అన్నారు.

రెండు బేసిక్ మొబైల్స్ తెచ్చుకుని కోలార్ మీదుగా మునిరత్న ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరారు. పోలీసులకు లొకేషన్ దొరక్కపోవడంతో మొదట మునిరత్న ఆచూచి చిక్కలేదు. బేసిక్ మొబైల్ ఉపయోగించిన బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న తప్పించుకునేందుకు ప్రయత్నించారని, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఆయన్ను అరెస్టు చేశామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను పోలీసులు అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకొచ్చారు.

రెండు కేసుల్లో ఒకటి బీబీఎంపీ కాంట్రాక్టర్ చెలువరాజును బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని నమోదు అయ్యింది. రెండో కేసు అట్రాసిటీ కేసులో వేలు నాయక్ ఫిర్యాదు చెయ్యడంతో రెండో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తొలి ఎఫ్‌ఐఆర్‌పై బెంగళూరులోని వయాలికావల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండో ఎఫ్‌ఐఆర్ అట్రాసిటీ కేసు దర్యాప్తు బాధ్యతలను బెంగళూరులోని శేషాద్రిపురం ఏసీపీకి అప్పగించారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మునిరత్న తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన మునిరత్న ఆపరేషన్ కమలలో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం బీజేపీలో చేరారు.












Click it and Unblock the Notifications