girlfriend: గర్ల్ ఫ్రెండ్ ను రేప్ చేశాడు, ప్రియుడికి జస్ట్ 10 ఏళ్లు జైలు శిక్ష, చిన్న లాజిక్ మిస్ !

చెన్నై/ అరియలూరు: ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. యువతి, యువకుడు చదువుకున్నారు. అందమైన అమ్మాయిని ఆ యువకుడు ప్రేమించాడు. యువకుడు కూడా చూడటానికి బాగానే ఉండటంతో ఆ యువతి కూడా అతన్ని ప్రేమించింది. చాలా సంవత్సరాలను ప్రేమికులు హ్యాపీగా తిరిగారు. పెళ్లి చేసుకుంటాడని నమ్మకంతో ప్రియురాలు ఆమె ప్రియుడి మీద నమ్మకం పెట్టుకుంది. ప్రియురాలు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో వెళ్లిన ప్రియుడు ఆమె మీద రేప్ చేశాడు. అప్పటి నుంచి ఆమెను బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేశాడు. పెళ్లి విషయం వచ్చే సరికి ప్రియుడు రివర్స్ అయ్యాడు. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరిగింది. దెబ్బకు ప్రియుడికి 10 సంవత్సరాలు జైలు శిక్షపడింది. ఒక్క చిన్న లాజిక్ మిస్ అయిన ప్రియుడు జైలుపాలైనాడు.

 లవర్స్

లవర్స్

తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని అందిమడం సమీపంలని సాతనపట్టు ప్రాంతంలో ఆనంద్ రాజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అనంద్ రాజ్ నివాసం ఉంటున్న ఊరిలోనే నివాసం ఉంటున్న హర్షితన (పేరు మార్చడం జరిగింది) అనే యువతికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఆనంద్ రాజ్, హర్షితా బాగా చదువుకున్నారు. అందమైన అమ్మాయి హర్షితాను ఆనంద్ రాజ్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించాడు. కొంతకాలం తరువాత హర్షితా కూడా ఆనంద్ రాజ్ ను ప్రేమించింది.

ప్రియురాలిని రేప్ చేశాడు

ప్రియురాలిని రేప్ చేశాడు

ఆరు సంవత్సరాలు ప్రేమికులు ఆనందర్ రాజ్, హర్షితా హ్యాపీగా తిరిగారు. ఆనందర్ రాజ్ పెళ్లి చేసుకుంటాడని నమ్మకంతో అతని ప్రియురాలు హర్షితా ఆమె ప్రియుడి మీద నమ్మకం పెట్టుకుంది. 2016 సెప్టెంబర్ నెలలో ప్రియురాలు హర్షితా ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకున్న ఆనంద్ రాజ్ ఆమె ఇంటికి వెళ్లాడు. తరువాత ప్రియురాలు హర్షితాను బెదిరించిన ఆనంద్ రాజ్ ఆమె మీద రేప్ చేశాడు. అప్పటి నుంచి ప్రియురాలిని బెదిరించిన ఆనంద్ రాజ్ అనేకసార్లు ఆమె మీద అత్యాచారం చేశాడని తెలిసింది.

 నేను పెళ్లి చేసుకోనే.. నువ్వు ఏం చేస్తావో చేసుకో ?

నేను పెళ్లి చేసుకోనే.. నువ్వు ఏం చేస్తావో చేసుకో ?

కొన్ని రోజుల తరువాత ప్రియురాలు ఎదురుతిరగడంతో ఆనంద్ రాజ్ షాక్ అయ్యాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు హర్షితాకు చెప్పాడు. అప్పటికే మ్యాటర్ హర్షితా కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. మీ అమ్మాయిని కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని ఆనంద్ రాజ్ అతని ప్రియురాలు హర్షితా కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చాడు. అయితే రెండు సంవత్సరాల తరువాత ఆనంద్ రాజ్ రివర్స్ అయ్యాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆనంద్ రాజ్ అతని ప్రియురాలికి తేల్చి చెప్పాడు.

 కేసు పెట్టిన ప్రియురాలు

కేసు పెట్టిన ప్రియురాలు

ప్రియుడు ఆనంద్ రాజ్ రివర్స్ కావడంతో ప్రియురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు నేరుగా ఆనంద్ రాజ్ ఇంటికి వెళ్లారు. పెళ్లి విషయం గురించి ఆనంద్ రాజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆనంద్ రాజ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు రివర్స్ అయ్యి మీకు చేతనైయ్యింది చేసుకోండి అంటూ అమ్మాయి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఆనంద్ రాజ్ మోసం చేశాడని తెలుసుకున్న అతని ప్రియురాలు 2019లో జయగొండం పోలీస్ స్టేషన్ లో ఆనంద్ రాజ్ మీద రేప్ కేసు పెట్టింది. పోలీసులు ఆనంద్ రాజ్ ను అరెస్టు చేసి విచారణ చేసి ఎఫ్ఐఆర్ ను కోర్టుకు ససమర్పించారు.

 ప్రియుడికి సినిమా కనపడింది

ప్రియుడికి సినిమా కనపడింది

అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. మూడు సంవత్సరాల తరువాత ఆనంద్ రాజ్ అతని ప్రియురాలి మీద అత్యాచారం చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని కోర్టులో రుజువు అయ్యింది, ఆనంద్ రాజ్ కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించిన కోర్టు బాధితురాలికి తమిళనాడు ప్రభుత్వం రూ. 1 లక్షా 10 వేలు నష్టపరిహారం అందివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రియురాలిని మోసం చేసి రేప్ చేసిన ఆనంద్ రాజ్ ఇప్పుడు జైలుపాలైనాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+