Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని పొగిడినందుకు ప్రాణం తీసిన క్యాబ్ డ్రైవర్!

లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో కారులో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన చిన్న రాజకీయ చర్చ చివరికి ఒకరి హత్యకు దారి తీసింది. రాజకీయ చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను క్యాబ్‌లో కూర్చున్న ఓ ప్రయాణికుడిని పొగిడారని ఆగ్రహం వ్యక్తం చేసిన క్యాబ్ డ్రైవర్ ఆ ప్రయాణికుడిని హత్య చేసి పరారయ్యాడు.

ఉత్తరప్రదేశ్ మీడియా కథనాల ప్రకారం రాజేష్ దూబే (52) ఓ వివాహ శుభకార్యం కార్యక్రమం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లడానికి ఓ క్యాబ్‌లో ఎక్కాడు. ఈ సమయంలో అతను క్యాబ్ డ్రైవర్ అయిన అమ్జాద్‌తో రాజకీయ చర్చలు జరిపాడు.

A cab driver brutally murdered a man who praised PM Modi and UP CM Yogi Adityanath

మహోఖర్ గ్రామ మాజీ అధిపతి ధీరేంద్ర ప్రతాప్ కూడా అతనితో ఉన్నారు. చర్చ సందర్భంగా, నిందితుడు డ్రైవర్ అమ్జాద్ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను దుర్భాషలాడడం ప్రారంభించాడని, దానికి రాజేష్ దూబే అభ్యంతరం చెప్పాడు. అనంతరం రాజేష్ దూబేపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమ్జద్ అతనితో వాగ్వాదానికి దిగాడు.

ఈ సమయంలో కారులో కూర్చున్న ధీరేంద్ర ప్రతాప్ జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ దశలో వివాదం సద్దుమణిగిందని భావించిన అమ్జద్ మాత్రం వేరే ప్లాన్ వేసుకున్నాడు. రాజేష్ దూబే డ్రాప్-ఆఫ్ పాయింట్ వద్దకు వచ్చినప్పుడు, క్యాబ్ డ్రైవర్ అమ్జద్ అతన్ని ఇంటి తలుపు వద్ద దింపకుండా, ఇంటికి కొంత దూరంలో ఉన్న రహదారిపై వదిలిపెట్టాడు.

అయినా మాట్లాడకుండా కారు దిగిన రాజేష్ దూబే ఇంటికి వెళ్లే దారిలో నడవడం ప్రారంభించాడు. ఈ సమయంలో బొలెరో కారు డ్రైవర్‌గా ఉన్న అమ్జాద్ ఉద్దేశపూర్వకంగా రాజేష్ దూబేపైకి కారును నడిపి హత్య చేశాడు. రాజేష్ దూబే కూడా దాదాపు 200 మీటర్లు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా, యూపీ పోలీసులు డ్రైవర్ అమ్జాద్‌పై కేసు నమోదు చేశారు. రాజేష్ దూబే కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెంది నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మిర్జాపూర్-ప్రయాగరాజ్ హైవేను దిగ్బంధించి నిరసన తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు మీర్జాపూర్ పోలీసులు మంగళవారం క్యాబ్ డ్రైవర్ అమ్జాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+