Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టేకాఫ్‌కు కొన్ని క్షణాల ముందు- ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా- కలకలం..!!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం చోటు చేసుకుంది. టేకాఫ్ తీసుకోవడానికి కొన్ని క్షణాల ముందు ఓ విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ అందింది. దీనితో అప్పటికప్పుడు ఆ విమానాన్ని నిలిపివేశారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు. తక్షణమే స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే విమానాశ్రయానికి చేరుకున్న అధికారులు ప్రయాణికులను ఖాళీ చేయించారు.

ఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని పుణెకు బయలుదేరి వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఫ్లైట్ అది. టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధమైన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఎయిర్ పోర్ట్ అధికారులకు ఈ బాంబు బెదిరింపు ఫోన్ కాల్ అందింది. విమానంలో బాంబు పెట్టామని, ఇంకాస్సేపట్లో అది పేలిపోతుందనీ హెచ్చరించారు. విమానాశ్రయం అధికారులు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ద్వారా పైలెట్ కు ఈ సమాచారాన్ని చేరవేశారు.

A call regarding a bomb in Pune bound Spicejet flight from Delhi was received before the takeoff

స్థానిక పోలీసులు, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ జవాన్లను అప్రమత్తం చేశారు. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను విమానం నుంచి కిందికి దించేశారు. వారిని దూరంగా తీసుకెళ్లారు. ఫ్లైట్ ను ఐసొలేషన్ ఏరియాలో ఉంచి- క్షుణ్నంగా తనిఖీ చేశారు. విమానంలో బాంబు ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని, అయినప్పటికీ- ముందుజాగ్రత్త చర్యగా అణువణువూ పరిశీలిస్తోన్నామని పేర్కొన్నారు.

ఓ విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం మూడు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ అందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విమానంలో 244 మంది ప్రయాణికులు ఉన్నారు. భారత గగనతలంలోకి ప్రవేశించిన తరువాత ఈ ఫోన్ కాల్ అందింది. గుజరాత్ గగనతలం మీదుగా పనాజీకి వస్తోన్న విమానాన్ని దారి మళ్లించారు.

సమీపంలోనే ఉన్న జామ్ నగర్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. 24 గంటల తరువాత ఆ విమానం జామ్ నగర్ నుంచి గోవాకు చేరుకుంది. బాంబు ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు తాజాగా ఢిల్లీ నుంచి పుణెకు బయలుదేరి వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఫ్లైట్‌ కు అదే తరహా కాల్ రావడం ఆందోళనకు గురి చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+