బంగారు, వజ్రాల నగలు చోరీ చేసి బాయ్ ఫ్రెండ్ కు ఇచ్చిన లేడీ టీచర్, ఫ్యామిలీ మొత్తం ఇలా!
కూతురు ప్రేమ కోసం చేసిన తప్పుడు పనితో కుటుంబం మొత్తం రైలు కిందపడింది. తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాలైన కూతురు జీవన్మరణం మధ్య పోరాడుతోంది. ఇదే కుటుంబంలోని బాలుడు తప్పించుకుని పారిపోవడంతో ప్రాణాలతో భయటపడ్డాడు. ప్రియుడి మోజులో పడిన లేడీ టీచర్ వెనుకా ముందు ఆలోచించకుండా చేసిన పనికి ఓ కుటుంబం సర్వనాశనం అయ్యింది.
కర్ణాటకలోని రాయచూరులోని రామలింగేశ్వర్ నగరానికి చెందిన సమీరా అహ్మద్ (50), అతని భార్య జులేఖాబేగం (44) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆ దంపతుల కుమార్తె మైమోనా బేగం (21) రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తండ్రి, తల్లి, కుమార్తెతో సహ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లినప్పుడు వారి వెంట దంపతుల కుమారుడు అయాన్ (12) కూడా వాళ్ల వెనుకనే వెళ్లాడు. కొడుకుతో సహ అందరూ రైల్వే ట్రాక్‌పై పడుకున్నారు. అయితే రైలు వేగంగా రావడంతో కొడుకు ఆయాన్ భయంతో పారిపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు.

సమీర్ అహ్మద్ టాటా ఏస్ వాహనాలను అద్దెకు ఇచ్చి జీవనం సాగిస్తున్నాడు. సమీర్ భార్య జులేఖా బేగం ఇంటిపని చేసుకుంటున్నదని. దంపతుల కూతురు మైమోనా బేగం ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. లేడీ టీచర్ గా పని చేస్తున్న కూతురు మైమోనా బేగంకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యాలని ఆమె తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అయితే స్కూల్ లో పాఠాలు చెప్పడానికి వెలుతున్న లేడీ టీచర్ మైమోన్ బేగంకు ఓ యువకుడు రొమాన్స్, సెక్స్ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. లేడీ టీచర్ బేగం ప్రియుడి వ్యామోహంలో పడిపోయి అతను చెప్పింది చెయ్యడం మొదలుపెట్టింది.
రాయచూరులో నివాసం ఉంటున్న ప్రముఖ వ్యాపారి మహిమ్మద్ హుస్సేన్ ఇంటికి వెలుతున్న లేడీ టీచర్ మైమోన్ బేగం అతని కుమారుడికి ట్యూషన్ చెప్పేది. మైమోనా బేగం ఇటీవల మహిమ్మద్ హుస్సేన్ ఇంట్లో డైమండ్ నెక్లెస్, బంగారు నగలు చోరీ చేసింది. దీనిపై మహిమూద్ హుస్సేన్ రాయచూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇంటి యజమాని కేసు పెట్టాడని తెలుసుకున్న మైమోనా బేగం భయపడిపోయింది.
పోలీసులు విచారణ ప్రారంభించారు. దొంగిలించిన కొంత బంగారాన్ని మహిమ్మద్ హుస్సేన్ ఇంటి కిటికీలోంచి వెనక్కి విసిరేసింది. అయితే ఆ దృశ్యం సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీనిపై పోలీసులు లేడీ టీచర్ మైమోనా బేగంను పిలిపించి విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. సర్ఫరాజ్ అనే యువకుడిని తాను ప్రేమిస్తున్నానని, దొంగిలించిన నగలను అతడికి ఇచ్చానని లేడీ టీచర్ మైమోన్ బేగం పోలీసులకు చెప్పింది.
తరువాత చోరీ చేసిన బంగారు నగలు తెచ్చి ఇస్తానని ఇంటి యజమాని హుస్సేన్ కాళ్లు పట్టుకోవడంతో ఆయనతో పాటు పోలీసులు లేడీ టీచర్ కు కొన్ని రోజులు సమయం ఇచ్చారు. చోరీ చేసి ఇచ్చిన బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వాలని సర్ఫరాజ్‌ను అడగ్గా అతను తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైనాడు. ప్రియుడు మోసం చెయ్యడం, దొంగతనం కేసులో చిక్కుకోవడంతో లేడీ టీచర్ మైమోన్ బేగం హడలిపోయింది. కొంతకాలం నుంచి పోలీసులు, ప్రియురాలు వెతుకుతున్నా ప్రియుడు సర్పరాజ్ మాత్రం లేడీ టీచర్ తో పాటు పోలీసులకు కనపడలేదు.
తరువాత లేడీ టీచర్ మైమోన్ బేగం ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. కూతురు చెడు ప్రవర్తనకు భయపడిన తల్లిదండ్రులు అవమానంతో కుమలిపోయారు. తరువాత మాట్లాడుకున్న ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు విచారణ చేస్తున్నారు. లేడీ టీచర్ మైమోన్ బేగంకు తీవ్రగాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. ఇంత జరగడానికి కారణం అయిన ప్రియుడు సర్పరాజ్ మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications