Eggs: బంగారు కోడిపెట్ట.. ఒక్క రోజే 31 గుడ్లు పెట్టిన కోడి..
సాధారణంగా కోడి రోజు ఒక్క గుడ్డు పెడుతుంది. నెలకు 15 నుంచి 18 గుడ్లు పెడతాయి. కానీ ఓ చోట ఓ కోడి ఒక్క రోజులో ఏకంగా 31 గుడ్లు పెట్టింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా భికియాసైన్‌కి చెందిన కోడి వార్తల్లో నిలిచింది. ఒక్కరోజులో 31 గుడ్లు పెట్టి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత కోడిని, దాని గుడ్లను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలొస్తున్నారు.

24 గంటల్లో
ఈ కోడి 24 గంటల్లో నిరంతరం గుడ్లు పెడుతునే ఉంది. దీనిని అందరు ప్రకృతి అద్భుతంగా భావిస్తున్నారు. ఈ ఘటనను గిన్నిస్ బుక్‌లో నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 25న గిరీష్ ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి కోడి 5 గుడ్లు పెట్టిందని అతని పిల్లలు చెప్పారు. అది విన్న గిరీశ్ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కోడి ప్రతి 10,-15 నిమిషాలకు ఒక గుడ్లు పెట్టడం మొదలుపెట్టిందట.

200 గ్రాముల వేరుశెనగ
అలా మొత్తం 31 గుడ్లు పెట్టడం చూసి అందరూ అవాక్కయ్యారు. దీంతో కోడికి ఏదైనా వ్యాధి సోకిందేమోనని గిరీష్ భావించారు. డాక్టర్ దగ్గరకు వెళ్లగా కోడికి ఎలాంటి రోగం లేదని నిర్థారించడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఈ కోడి వేరుశెనగ, వెల్లుల్లిపాయలను అమితంగా ఇష్టపడేదని యజమాని చెప్పారు. తన వద్ద రెండు కోళ్లు ఉన్నాయని, కోళ్లకు సాధారణ ఆహారంతో పాటు వేరుశెనగ కూడా తినిపించేవాడని చెబుతున్నారు. ప్రతి రోజు కోడి దాదాపు 200 గ్రాముల వేరుశెనగ తింటుందన్నారు.












Click it and Unblock the Notifications