కారు-ట్రక్కు ఢీ, నిద్రలోనే 10 మంది ప్రయాణికులు దుర్మరణం, ముగ్గురి పరిస్థితి విషమం!

ముంబై: మహారాష్ట్రలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. యవతమల్ జిల్లాలోని అర్ని సమీపంలో శుక్రవారం వేకువ జామున తవేరా కారు-ట్రక్కు ఢీకొనడంతో 10 మంది దుర్మరణం చెందారు. తీవ్రగాయాలైన ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అదే రహదారిలో వెలుతున్న వారు ప్రమాదం జరిగిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్ ల్లో మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియడం లేదని, వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు అన్నారు.

A collision between a car and a truck has left 10 dead in Maharashtra

శుక్రవారం వేకువ జామున అర్ని సమీపంలోని రహదారిలో వేగంగా వెలుతున్న ట్రక్కు తవేరా కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. తవేరా కారులో ఉన్న ప్రయాణికులు అందరూ గాడనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+