400 ఏళ్ళుగా అక్కడ ఒక్క మహిళ కూడ బిడ్డకు జన్మనివ్వలేదు, ఎందుకంటే?

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గడ్ జిల్లా సాంకా శ్యామ్‌జీ గ్రామంలో ఒక్క మహిళ కూడ బిడ్డకు జన్మనివ్వలేదు. 400 ఏళ్ళుగా ఈ గ్రామానికి చెందిన మహిళలంతా ప్రసవం కోసం పొలిమేర దాటి వెళ్తున్నారు. గ్రామానికి ఉన్న శాపం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

400 ఏళ్ళుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గడ్ జిల్లా సాంకా శ్యామ్‌జీ గ్రామంలోని మహిళలు ప్రసవం కోసం పొలిమేర దాటి వెళ్తారు. దేవతల శాపం కారణంగా ఈ గ్రామంలో మహిళలు ప్రసవిస్తే పిల్లలు అంగవైకల్యంతో పుడతారని ఆ గ్రామస్థుల విశ్వాసం.

A Curse, Says Village Where No Woman Has Given Birth In 400 Years

16వ శతాబ్దంలో దేవుళ్లు ఆ గ్రామంలో ఆలయం నిర్మిస్తుండగా ఓ మహిళ గోధుమలు దంచుతూ శబ్దం చేసింది. దేవతలకు తపోభంగమై ఆ గ్రామంలో మహిళలు పిల్లలకు జన్మనివ్వకుండా శపించారని గ్రామస్థులు నమ్ముతున్నారు.

ఈ కారణంగా సుమారు 90 శాతం మహిళలు గ్రామం వెలుపలే ప్రసవం కోసం వెళ్తారని చెప్పారు. అంతేకాదు ప్రసవాలన్నీ ఆసుపత్రుల్లోనే జరుగుతాయని గ్రామస్థులు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రసవం చేయాల్సి వస్తే గ్రామం పొలిమేరను దాటించనున్నట్టు గ్రామ సర్పంచ్ నరేంద్ర గర్జార్ చెప్పారు. అంతేకాదు అత్యవసర పరిస్థితుల్లో ప్రసవాల కోసం గ్రామం వెలుపల ఓ గదిని కూడ నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+