Crime News: దృశ్యం సినిమా చూపించారు.. తండ్రిని తల్లి, ప్రియడితో కలిసి హత్య చేసిన కుమార్తె..
దృశ్యం సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఈ మూవీలో ఓ వ్యక్తిని చంపి దొరక్కుండా ఉంటారు. పోలీసులు ప్రశ్నిస్తే అందురు ఒకే రకమైన సమాధానం చెబుతారు. అయితే ఇది సినిమా.. కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. తల్లి, ప్రియుడితో కలిసి తండ్రి చంపిన కుమార్తె పోలీసులకు దొరక్కుండా పెద్ద ప్లానే వేసింది. కానీ చివరికి పోలీసులకు చిక్కింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వ్యాపారం
కర్ణాటకలోని బెళగావికి చెందిన ప్రముఖ భూవ్యాపారి సుధీర్ కాంబళెను కొద్ది రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. ఇతనికి భార్య రోహిణి, కూతురు స్నేహ ఉన్నారు. అతను గతంలో దుబాయ్‌లో పని చేసి కరోనా టైమ్ లో సొంతూరుకు వచ్చారు. బెళగావిలోని క్యాంప్ ఏరియాలో ఉంటూ భూవ్యాపారాన్ని మొదలు పెట్టారు. వీరికి స్నేహ అనే కూతురు ఉంది. ఆమె మహారాష్ట్రలోని పుణెలో ఒక కళాశాలలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివింది.

తండ్రిపై కోపం
చదువు తర్వాత తిరిగి ఇంటికి చేరింది. పుణెలో ఉండగా స్నేహకు అక్షయ్ విఠకర్ తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. స్నేహ తరుచూగా ఫోన్ మాట్లాడుతుండడం గమనించిన తండ్రి సుధీర్ కుమార్తెను మందలించింది. అయినా స్నేహ విఠకర్ తో మాట్లాడడం మానలేదు. దీంతో తండ్రికి, కూతురుకు మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. తండ్రి తన ప్రేమను అంగీకరించకపోవడంతో పగ పెంచుకున్న స్నేహ నాన్నను చంపాలని నిర్ణయించుకుంది.

కత్తితో పొడిచి
దీనికి తల్లి సపోర్ట్ చేసింది. దీంతో తండ్రి హత్య ప్లాన్ చేసింది స్నేహ. విఠకర్ ను పుణె నుంచి బెళగావికి సెప్టెంబరు 15న పిలిపించింది. ఓ లాడ్జిలో ఉంచింది. 17న ఉదయం సుధీర్ ఇంటి పై అంతస్తులో నిద్రిస్తుండగా అక్షయ్‌ను తల్లీబిడ్డలు ఇంటికి పిలిపించారు. సుధీర్ కాళ్లు చేతులను వారిద్దరూ పట్టుకోగా.. విఠకర్ కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో సుధీర్ ప్రాణాలు విడిచాడు.హత్య జరిగిన వెంటనే అక్షయ్ విఠకర్ పుణె వెళ్లిపోయాడు.

ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం
ఆ తర్వాత తల్లీకూతుళ్లు అసలు కథ మొదలు పెట్టారు. తన భర్తను ఎవరో హత్య చేసి పరారయ్యారని రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు డీసీపీ రవీంద్ర ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. దర్యాప్తులో ఎలా అడిగినా.. వారిద్దరూ ఒకే రకమైన సమాధానాలు చెప్పారు. స్నేహ ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణం చేపట్టిన పోలీసులకు అనుమానం వచ్చింది. స్నేహ క్రమం తప్పకుండా అక్షయ్‌తో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై స్నేహను విచారించగా అసలు విషయం బయటకొచ్చింది.

దృశ్యం సినిమా 10 సార్లు చూశారు
వీరు హత్య చేసేముందు 'దృశ్యం' సినిమాను పదిసార్లు చూసినట్లు విచారణ సందర్భంగా ఒప్పుకొన్నారని ఎస్పీ తెలిపారు.












Click it and Unblock the Notifications