Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంటి అద్దెలు రూ 3 లక్షలు వస్తాయి, ప్రియుడితో బాత్ రూమ్ లో తల్లికి చిక్కిన కూతురు

ఆమెకు పెళ్లి అయ్యింది .కానీ వయసులో ఉన్న అబ్బాయితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. మహిళ అక్రమ సంబంధం విషయం ఆమె తల్లికి తెలిసిపోయింది. కూతురు, ఆమె బాయ్ ఫ్రెండ్ ను ఆమె తల్లి బాత్‌రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అంతే ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపేసిన కూతురు డాక్టర్లు, పోలీసుల ముందు నాటకాలు ఆడింది. అయితే క్లైమాక్స్ లో కిలాడీ కూతురు పోలీసులకు చిక్కింది.

బెంగళూరులోని బొమ్మనహళ్లి సమీపంలోని హొంగసంద్రలోని గురుమూర్తిరెడ్డి లేఔట్ లో నివాసం ఉంటున్న జయలక్ష్మి అనే మహిళ ఆమె కూతురి చేతిలోనే హత్యకు గురైయ్యింది. జయలక్ష్మి కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ప్రేమికుడితో కలిసి పవిత్ర అనే మహిళ ఆమె తల్లి జయలక్ష్మి మెడను టవల్‌తో బిగించి హత్య చేసిందని పోలీసులు తెలిపారు. తరువాత తన తల్లి జయలక్ష్మి బాత్ రూమ్ లో కాలుజారిపడిపోయందని, ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందని పవిత్ర ఓ కథ చెప్పి అందరిని నమ్మించడానికి ప్రయత్నించిందని పోలీసులు అన్నారు.

A daughter who killed her own mother with her boyfriend who had an illicit relationship

సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు. జయలక్ష్మి ఇంట్లోనే మృతి చెందిందింది. కుమార్తె పవిత్ర ఆమె తల్లి జయలక్ష్మిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు జయలక్ష్మి మృతి చెందినట్లు నిర్ధారించి బొమ్మనహళ్లి పోలీసులకు సమాచారం అందించారు. మా అమ్మ జయలక్ష్మికి పీరియడ్స్ వచ్చే సమయంలో చాలా రక్తస్రావం అవుతుందని, ఇలాగే ఎక్కువ రక్తం పోవడంతో నీరశించి అలసిపోయి బాత్‌రూమ్‌లో కాలు జారి పడిపోయిందని, ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చానని కూతురు పవిత్ర డాక్టర్లకు చెప్పింది.

అయితే మీ తల్లి చనిపోయిందని డాక్టర్ చెప్పడంతో ఆమె బోరున విలపించింది. పోలీసులు జయలక్ష్మి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సెయింట్ జాన్స్ ఆసుపత్రి తరలించారు. పోలీసులకు అనుమానం వచ్చి జయలక్ష్మి ఇంటికి తిరిగి వచ్చి శానిటరీ ప్యాడ్‌ని పరిశీలించారు. ఆ ప్యాడ్ లో రక్తపు మరకలు లేవు. పోలీసులు వైద్యులను విచారించగా ఐదు రోజుల క్రితం జయలక్ష్మి రుతుక్రమం ఆగిపోయిందని పోలీసులకు తెలిసింది.

A daughter who killed her own mother with her boyfriend who had an illicit relationship

జయలక్ష్మి చేయి, గడ్డంపై వేలుగోళ్ల గుర్తులు ఉండడంతోపాటు మెడపై బలంగా నొక్కిన గుర్తు కూడా ఉండడంతో ఆమె అల్లుడు సురేష్‌ కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. జయలక్ష్మి సొంత ఇండ్లు ఉన్నాయని, ఆమెకు ఇంటి అద్దెలు రూ. 3 లక్షలకు పైగా వస్తుందని పోలీసులు అన్నారు. జయలక్ష్మికి ఇద్దరు కూతుర్లు ఉన్నారని ఇద్దరికి పెళ్లి అయ్యిందని, సొంత తమ్ముడు సురేష్ కు కూతురు పవిత్రాను ఇచ్చి పెళ్లి చేసిందని పోలీసులు అన్నారు.

జయలక్ష్మి ఇంటిలోనే పవిత్ర, ఆమె భర్త ఉంటున్నారు. తన ఇంటిలో అద్దెకు ఉంటున్న లవనీష్ అనే యువకుడితో పవిత్ర అక్రమ సంబంధం పెట్టుకుంది. నెల రోజుల క్రితం పవిత్ర ఆమె ప్రియుడు బాత్ రూమ్ లో ఉంటే ఆమె తల్లి జయలక్ష్మి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మరుసటి రోజే జయలక్ష్మి ఆమె కూతురు పవిత్ర ప్రియుడు లవనీష్ ను ఇల్లు ఖాళీ చేయించి మరోసారి ఇటువైపు కనిపిస్తే నీ అంతు చూస్తానని హెచ్చరించింది.

తన వ్యవహారం తల్లి జయలక్ష్మికి తెలిసిపోయిందని, ఎప్పటికైనా తన భర్తకు మ్యాటర్ తెలుస్తుందని పవిత్ర భయపడింది. తరువాత ప్రియుడు లవనీష్ కు ఫోన్ చేసిన పవిత్రా ఇంట్లో ఎవరు లేరని, నువ్వు రావాలని చెప్పింది. ప్రియుడు లవనీష్ తో కలిసి బాత్ రూమ్ లో రొమాన్స్ చేస్తున్న సమయంలో తల్లి జయలక్ష్మి ఇంట్లోకి వెళ్లిందని పోలీసులు అన్నారు. ప్రియుడితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన పవిత్ర ఆమె తల్లి జయలక్ష్మిని చంపేసి డ్రామాలు ఆడిందని బొమ్మనహళ్లి పోలీసులు అన్నారు. పవిత్ర, ఆమె ప్రియుడు లవనీష్ ను పోలీసులు అరెస్టు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+