వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెలూన్ల నిండా వీర్యమా? సాధ్యమయ్యే పనేనా?: చర్చనీయాంశమైన వైద్యుడి ట్వీట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో హోళీ వేడుకల్లో ఇద్దరు విద్యార్థినులపై చోటు చేసుకున్న వికృత దాడులు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. వీర్యంతో నింపిన బెలూన్లను వారిపై విసిరిన ఆకతాయిలను కఠినంగా శిక్షించాలంటూ ఇప్పటికే నిరసనలు చేపట్టారు.

ఢిల్లీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ముందు వివిధ కళాశాలల విద్యార్థినులు ధర్నాకు దిగారు. జాతీయ మహిళా కమీషన్‌ సైతం ఈ వ్యవహారంపై మండిపడటంతో పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు.

బెలూన్లలో వీర్యం సాధ్యం కాదంటూ..

బెలూన్లలో వీర్యం సాధ్యం కాదంటూ..

కాగా, ఈ దాడిని నిరసిస్తూ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఒకరు తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ క్రమంలో వీర్యాన్ని బెలూన్లలో నింపి దాడులు చేయడం సాధ్యమయ్యే పనే కాదంటూ ఓ వైద్యుడు చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ప్రత్యేక పరికరాలు అవసరం

ప్రత్యేక పరికరాలు అవసరం

అంతేగాక, ఆమె తీరును ఖండిస్తూ సదరు వ్యక్తి ట్వీట్లు చేశారు. ‘అసలు అంత స్థాయిలో వీర్యాన్ని సేకరించటం సాధ్యమయ్యే పని కాదు. ఆరోగ్యవంతమైన మానవుడు 5 మిల్లిలీటర్ల కన్నా ఎక్కువ వీర్యాన్ని స్కలించలేడు. ఒకవేళ అంతస్థాయిలో సేకరించినా అది ఎంతో సేపు లిక్విడ్‌ స్టేజీలో ఉండలేదు. వాటిని నిల్వ చేయాలంటే ప్రత్యేక పరికరాల్లో నింపాల్సి ఉంటుంది' అని ఆ వైద్యుడు పేర్కొన్నాడు.

కారణాలతో వివరణ

కారణాలతో వివరణ

‘ఆ బెలూన్లలో నీటిని కలిపి నింపారనుకున్నా.. దాని తత్వాన్ని అది కోల్పోతుంది. పైగా అసలు దానిని బెలూన్లలో నింపటం కుదిరే పని కాదు. పోనీ.. ద్రవరూప నైట్రస్‌ ఆక్సైడ్‌తో దానిని నింపారనుకున్న అందుకు ఆస్కారమే లేదు' అంటూ పలు కారణాలను వివరిస్తూ ఆ వాదనను ఖండించారు.

ది గుడ్ డాక్టర్ పేరుతో..

ది గుడ్ డాక్టర్ పేరుతో..

కాలాతీథమ​ పేరుతో ‘ది గుడ్‌ డాక్టర్‌' పేరిట ఆ ట్విట్టర్‌ ఖాతా ఉంది. పైగా అందులోని వ్యక్తి వైద్యుల మాస్కులు ధరించి ఉండటంతో బహుశా ఆతనో వైద్యుడయి ఉంటాడని భావిస్తున్నారు. ఈ ట్వీట్లకు పలువురు మద్దతు పలుకుతుండగా, మరికొందరు మాత్రం ఖండిస్తున్నారు.

English summary
A tweet storm by a man who seems to be a doctor has gone viral after he decided to respond to the stories of women being hit with balloons filled with semen in Delhi. His simple point - it may not be medically possible to fill a balloon with semen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X