Dipcovan: యాంటీ బాడీ డిటెక్షన్ కిట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ: రేటు తక్కువే
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం మొన్నటికి మొన్న 2డీజీ మెడిసిన్‌ను అభివృద్ధి చేసిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ (DRDO) మరో సంచలనానికి తెర తీసింది. యాంటీ బాడీ డిటెక్షన్ కిట్‌ను అభివృద్ధి చేసింది. దాని పేరు డిప్కోవాన్ (Dipcovan). కరోనా వైరస్ తీవ్రత, దాని న్యూక్లియోక్యాప్‌సైడ్ ప్రొటీన్లను అది డిటెక్ట్ చేస్తుంది. వైరస్ తీవ్రత స్థాయిని 97 నుంచి 99 శాతం వరకు ఈ కిట్ పసిగట్టగలదని డీఆర్డీఓ వెల్లడించింది. దేశ రాజధాని ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్న వ్యాన్‌గార్డ్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ కిట్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది.
Recommended Video
ఢిల్లీలో 10 వేల మంది కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల నుంచి సేకరించిన నమూనాలో కిట్‌ను వాలిడేట్ చేసినట్లు స్పష్టం చేసింది. దాని ఖచ్చితత్వం 97 నుంచి 99 శాతం వరకు నమోదైనట్లు పేర్కొంది. ఏడాదికాలంగా ఈ కిట్‌పై తాము పరిశోధనలు చేస్తోన్నామని తెలిపింది. దీన్ని వినియోగంలోకి తీసుకుని రావడానికి అవసరమైన అనుమతుల కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు పంపించామని డీఆర్డీఓ పేర్కొంది. తాజాగా దీనికి అనుమతి లభించినట్లు వెల్లడించిది. డీసీజీఐ, సీడీఎస్‌సీఓ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా ఈ కిట్ అమ్మకాలు, సరఫరా, పంపిణీని పర్యవేక్షిస్తాయని స్పష్టం చేసింది.

ఈ కిట్‌ను వ్యాపార అవసరాల కోసం వచ్చేనెల మొదటివారంలో మార్కెట్లోకి విడుదల చేస్తామని డీఆర్డీఓ ఇండస్ట్రీ పార్ట్‌నర్ వ్యాన్‌గార్డ్ డయాగ్నస్టిక్స్ యాజమాన్యం తెలిపింది. ప్రారంభంలో 10 వేల కిట్లను అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది. ప్రతినెలా కొత్తగా 500 యాంటీబాడీ డిటెక్షన్ కిట్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపింది. ఈ కిట్ ధర ఎంత అనేది ఇంకా నిర్ధారించలేదు. ప్రాథమిక అంచనాల ప్రకారం. ఒక్కో కిట్ రేటు 75 రూపాయలుగా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. డీఆర్డీఓ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఈ కిట్‌ను రూపొందించినట్లు తెలిపిందా సంస్థ.












Click it and Unblock the Notifications