వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైన్ కట్టమంటే కట్టని డ్రైవర్.. కారు బానెట్ పై కూర్చున్న ట్రాఫిక్ పోలీస్; తర్వాత జరిగిందిదే.. వీడియో వైరల్

|
Google Oneindia TeluguNews

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా, జరిమానా చెల్లించమని అడిగిన ట్రాఫిక్ పోలీసు విధులను అడ్డగించిన ఓ కారు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫైన్ కట్టమంటే కట్టకుండా డ్రైవర్ కారును ఆపకుండా వెళుతున్న క్రమంలో, బానెట్ పైకెక్కి కారును ఆపే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ పోలీస్ కు షాక్ ఇచ్చిన ఘటన ముంబై అందేరి పశ్చిమలో చోటు చేసుకుంది.

ముంబైలో 30 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ .. 28 మంది పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్నా సరే !!ముంబైలో 30 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ .. 28 మంది పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్నా సరే !!

రాంగ్ రూట్ లో వచ్చిన వాహనదారుడిని ఆపేందుకు పోలీస్ యత్నం .. షాకింగ్ వీడియో

రాంగ్ రూట్ లో వచ్చారంటూ ట్రాఫిక్ పోలీస్ కారును ఆపే ప్రయత్నం చేసినా ఆపకుండా కారును ఓ కిలోమీటర్ మేర అలాగే నడిపాడు ఓ డ్రైవర్ . ట్విస్ట్ ఏంటంటే ట్రాఫిక్ పోలీసు కారును ఆపే క్రమంలో బానెట్ పై కూర్చున్నా సరే అలాగే ఓ కిలోమీటర్ మేర తీసుకెళ్ళాడు. అందరూ షాక్ అయిన ఈ ఇష్యూలో బానెట్ పై ట్రాఫిక్ పోలీస్ కూర్చొని ఉండగా కార్ వెళ్తున్న క్రమాన్ని చాలామంది వీడియో తియ్యగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

నిబంధనలు ఉల్లంఘించి జరిమానా తప్పించుకునే ప్రయత్నం చేసిన డ్రైవర్ .

నిబంధనలు ఉల్లంఘించి జరిమానా తప్పించుకునే ప్రయత్నం చేసిన డ్రైవర్ .

అసలేం జరిగిందంటే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాను తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న అంధేరి (పశ్చిమ) లో సంఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత ట్రాఫిక్ పోలీసు ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై మాట్లాడిన ట్రాఫిక్ పోలీస్ అధికారి, కానిస్టేబుల్ విజయసింగ్ గురవ్ (48) అంధేరిలోని ఆజాద్ నగర్ మెట్రో స్టేషన్ క్రింద విధులు నిర్వర్తిస్తుండగా, కారు రాంగ్ సైడ్ నుండి లోపలికి ప్రవేశించి ఎస్వీ రోడ్డు వైపు వెళ్లిందని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వాహనాన్ని ఆపమని ట్రాఫిక్ సిబ్బంది కారు డ్రైవర్‌ని అడిగారని, కానీ ఏదో గుర్తింపుకార్డు చూపించి పారిపోవడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు.

ఆపే క్రమంలో బానెట్ మీద కూర్చున్న ట్రాఫిక్ పోలీస్ .. ఆ తర్వాత జరిగిందిదే

అయితే, డ్రైవర్ తప్పించుకునే క్రమంలో ట్రాఫిక్ పోలీస్ గురవ్ గభాలున కారు బానెట్ మీద కూర్చున్నాడు. అలా అయితే కారు ఆపుతాడని భావించారు. కానీ అతను ఒక దాదాపు ఒక కిలోమీటరు మేర అలాగే వాహనాన్ని నడిపే ట్రాఫిక్ పోలీసును కింద పడేశాడు.గురవ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, కారు డ్రైవర్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) 353 (ప్రభుత్వ ఉద్యోగిని తన విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) మరియు 279 (ర్యాష్ డ్రైవింగ్) వంటి సెక్షన్ల కింద ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు వీడియోలను చిత్రీకరించారు. దీనిలో కానిస్టేబుల్ కారు బానెట్‌పై కూర్చొని ఉండడం, డ్రైవర్ వాహనాన్ని స్పీడ్ గా నడిపి ట్రాఫిక్ పోలీసును కింద పడేయడం కనిపిస్తుంది . ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

 డ్రైవర్ తప్పని కొందరు, ట్రాఫిక్ పోలీస్ బానెట్ మీద కూర్చోవటం తప్పని ఇంకొందరు .. సోషల్ మీడియాలో రచ్చ

డ్రైవర్ తప్పని కొందరు, ట్రాఫిక్ పోలీస్ బానెట్ మీద కూర్చోవటం తప్పని ఇంకొందరు .. సోషల్ మీడియాలో రచ్చ

వాహనం నడిపిన డ్రైవర్ తీరును కొంతమంది విమర్శిస్తుంటే,వాహనం పైకెక్కి కూర్చున్న ట్రాఫిక్ పోలీసును మరి కొంతమంది విమర్శిస్తున్నారు. ఒక మనిషి కారు బానెట్ మీద కూర్చుని ఉండగా కారు నడిపి అతనిని ప్రాణాపాయంలోకి నెట్టారని కొందరంటుంటే, ట్రాఫిక్ పోలీసులు చలాన్లు తప్పించుకోవాలి అనుకునేవారికి , వాహనం నెంబర్ ఫోటో తీసి చలాన్లు పంపించవద్దని కానీ అలా కాకుండా ట్రాఫిక్ పోలీసు ప్రాణాలకు రిస్కు చేసి వాహనం బానెట్ పైన కూర్చోవడం బాలేదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కారు బానెట్ మీద ఎక్కి కూర్చున్న ట్రాఫిక్ పోలీసును ప్రాసిక్యూట్ చెయ్యాలని అంటున్నారు. నిబంధనలు పాటించక పోవడం వాహనదారుల తప్పయితే, వాహనదారుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం ట్రాఫిక్ పోలీసుల తప్పంటూ ఈ ఘటనపై నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది.

English summary
A driver who violated traffic rules tried to avoid being fined, while the traffic police climbed on the bonnet of the car. The driver drove about a kilometer and knocked the traffic police down. The video in Mumbai went viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X