డ్రైవర్ కు గుండెపోటు: ఢిల్లీలో దూసుకెళ్లిన బస్సు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో డిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ బస్సు నడుపుతున్న డ్రైవర్ కు గుండె పోటు రావడంతో ఆ వాహనం పాదచారుల మీదకు దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పాదచారులు మరణించారు.
సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో తీవ్రగాయాలైన సూరజ్ (21), ఆటో డ్రైవర్ కేశవ్ (48), బస్సు డ్రైవర్ మరణించారు. ఈ ప్రమాదంలో పాదచారులు సంతోష్ కుమార్ (19), రాజేష్ కుర్మా (45), మహేందర్ కుమార్ (24) అనే ముగ్గురికి తీవ్రగాయాలై చికిత్స పోందుతున్నారని పోలీసులు అన్నారు.

వాజిద్ ఆలీ అనే వ్యక్తి శుక్రవారం మద్యాహ్నాం బస్సు నడుపుకుంటు వెలుతున్నాడు. మార్గం మద్యలో చాందినీ చౌక్ ప్రాంతంలో ఆయనకు గుండె పోటు రావడంతో బస్సు అదుపుతప్పింది. బస్సు ఒక్కసారిగా పాదచారుల మీదకు దూసుకు వెళ్లింది.
బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. తరువాత వాజిద్ ఆలీ బస్సు స్టీరింగ్ మీద వాలిపోయాడు. అప్పటికే బస్సు దూసుకు వెళ్లి ఐదు మంది పాదచారులకు తీవ్రగాయాలైనాయి. వెంటనే గాయాలైన పాదచారులను, బస్సు డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికికే ఇద్దరు పాదచారులతో పాటు బస్సు డ్రైవర్ వాజిద్ ఆలీ మరణించారని సుశ్రుత ట్రామా సెంటర్ సీఎండీ డాక్టర్ ఎస్ఎం బస్మా తెలిపారు. మరణించిన పాదచారి సూరజ్ స్థానికంగా నివాసం ఉండేవాడని కేసు దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications