Cake: కేక్ తిని ప్రాణాలు కోల్పోయిన ఐదేళ్ల బాలుడు..!

బెంగళూరుకు చెందిన బాలరాజు ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అతని భార్య, ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. వారి జీవితం సాఫీగా సాగిపోతోంది. అయితే అతను డెలివరీ బాయ్ గా పని చేయడమే వారికి పాపం అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బాలరాజ్ ఫుడ్ డెలివరీ బాయ్ గా చాలా చోట్ల ఫుడ్ డెలీవరి చేస్తుంటాడు. 2024, అక్టోబర్ 7వ తేదీ అతను ఓ కేక్ ఆర్డర్ రావడంతో కేక్ తీసుకుని డెలివరీ బయల్దేరారు. అయితే అవతలి వ్యక్తి ఆర్డర్ ను క్యాన్సల్ చేశాడు. దీంతో ఆ కేక్ ను బాల రాజ్ ఇంటికి తీసుకెళ్లాడు.

వారి ఐదేళ్ల కుమారుడు పార్శిల్ చూసి తనకు కావాలని అడగంతో పార్శిల్ ఓపెన్ చేశారు. బాలరాజ్, కుమారుడు ధీరజ్, భార్య నాగాలక్ష్మి కేక్ తిన్నారు. కేకు తిన్న తర్వాత వారు తీవ్ర గడుపు నొప్పి వచ్చింది. అలాగే వాంతులు అయ్యాయి. దీంతో వారిని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ధీరజ్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. నాగాలక్ష్మి, బాలరాజ్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే ధీరజ్ చనిపోయినట్లుగా చెబుతున్నారు. కేక్ తినడం వల్లే ఇదంతా జరిగిందని బాలరాజ్ అత్తమ్మ చెబుతున్నారు.

A five-year-old boy died after eating cake in Bangalore

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆలాగే ధీరజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఈ కేక్ ఆర్డర్ ఎవరు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు. ఏ బేకరీ ఈ కేక్ తయారు చేసిందో దర్యాప్తు చేస్తున్నారు. వారి ఫ్యామిలీ మధ్యాహ్నం, రాత్రి భోజనంలో రొట్టెలతో పాటు పాపడ్ తీసుకున్నట్లు చెప్పారు. వీటిని స్థానిక కిరాణా షాప్ నుంచి కొనుగోలు చేసినట్లు వివరించారు. కేక్ తిని బాలుడు చనిపోయిన ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బాలుడు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినట్లు తెలిస్తే పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.

గత ఏప్రిలో ఓ బాలిక పుట్టిన రోజు కేక్ తిని మృతి సంగతి తెలిసిందే. ఈ ఘటన పంజాబ్ లో జరిగింది. కేక్ లో సింథటిక్ స్వీటెనర్ అధిక మోతాదులో కలపడంతో బాలిక మృతి చెందింది. మీ కూడా పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేటప్పుడు ఇంట్లో కేక్ తయారు చేసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+