ఎన్ని తెలివితేటలు?, పరీక్షలకు భయపడి ఇంత పనిచెయ్యాలా ?, మహిళా కమీషన్ ఎంట్రీతో?
న్యూఢిల్లీ: మహిళలు, మైనర్లపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులు తరచూ ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కొందరు కామాంధులు వయసుతో తేడా లేకుండా అమ్మాయిలు, మహిళల మీద లైంగిక దాడులు, అత్యాచారాలు చేస్తున్నారు. ఇందులో కొందరు తప్పుడు కేసులు కూడా నమోదు చేస్తున్నారని గతంలోనే చాలా సార్లు వెలుగు చూసింది. అయితే ఓ స్కూల్ అమ్మాయి ?
దేశ రాజధాని న్యూఢిల్లీలోని హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక పరీక్షలు సరిగ్గా రాయలేదు. ఈ నేపథ్యంలో తనకు మార్కులు తక్కువ వస్తే తల్లిదండ్రులు తిడుతారనే ఉద్దేశంతో తనను తాను బ్లేడుతో కోసుకుని తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆ అమ్మాయి కుటుుంబ సభ్యులకు తప్పుడు ఫిర్యాదు చేసింది.

పరీక్షలు సరిగా రాయలేదని తెలిస్తే తల్లిదండ్రుల వేధింపుల నుంచి తప్పించుకునేందుకు తనను కొందరు వేధించారని బాలిక తప్పుడు కథనం చెప్పింది. మార్చి 15వ తేదీన ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్ ఈస్ట్ ఢిల్లీ) జాయ్ తిర్కీ ఈ కేసు విచారణ చేశారు. ఆ బాలిక పాఠశాల నుండి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని అబ్బాయిలు ఆమెను ఆపి, ఆమెను ఒక ప్రదేశానికి తీసుకెళ్లి, వేధించారని మరియు శారీరకంగా దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఆ అమ్మాయి స్వయంగా పెట్టింది స్కూల్ అమ్మాయి.
అనంతరం ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ చేశారని డీసీపీ తెలిపారు. తదనుగుణంగా ఆ అమ్మాయి ఫిర్యాదు మేరకు ప్రమాదకరమైన ఆయుధాలు ఉపయోగించి అమ్మాయి మీద దాడి చేసి ఉంటారని కేసు నమోదు అయ్యింది. దర్యాప్తులో బాధితురాలు గుర్తించిన నేరస్థలానికి సమీపంలో ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. బాలిక పేర్కొన్న స్థలం మరియు సమయంలో అలాంటి సంఘటన జరగలేదని పోలీసులు గుర్తించారు. అనంతరం బాలికను మరోసారి విచారించగా పరీక్షలకు భయపడి తాను తప్పుడు సమాచారం ఇచ్చానని బాలిక అంగీకరించిందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications