UP News: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసిన వివాహిత.. ట్రాలీ బ్యాగ్ లో శవం తీసుకెళ్తుండగా..
నేరాలు చేయడానికి భయపడడం లేదు. దేనికైనా తెగించి నేరాలకు పాల్పడుతున్నారు. పురుషులే కాదు స్త్రీలు కూడా తక్కువ కాదంటూ దూసుకెళ్తున్నారు. తాజాగా ఓ మహిళ ఓ వ్యక్తి గొంత కోసి హత్య చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని టీలా మోద్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

వివాహేతర సంబంధం..
పూర్తి వివరాల్లోకి వెళ్తే..ప్రీతి శర్మ అనే మహిళకు నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. కొంత కాలం భర్తతో సంతోషంగా జీవించిన ఆమె తర్వాత విభేదాలతో దూరంగా ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న ప్రీతికి ఫిరోజ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. అతని రోజు ఫోన్ మాట్లాడుతూ ఉండేది. ఇలా వారి మధ్య చనువు పెరిగి అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

పెళ్లికి ఒత్తిడి..
కొద్ది రోజులపాటు వీరి వివాహేతర సంబంధం సాగింది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని ప్రీతి శర్మ.. ఫిరోజ్‌పై తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది. ఒత్తిడికి తలొగ్గిన ఫిరోజ్ పెళ్లికి ఆంగీకరించాడు. కానీ అతని కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఒప్పుకోడవం లేదని, నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఫిరోజ్ ప్రీతికి చెప్పాడు.

ట్రాలీ బ్యాగ్ లో తీసుకెళ్తుండగా..
దీంతో ప్రీతి, ఫిరోజ్ కు మధ్య మాటామాట పెరిగింది. ప్రీతి ఆవేశంతో అక్కడే ఉన్న బ్లేడ్ తో ఫిరోజ్ గొంతు కోసింది. తీవ్ర రక్తస్రవం కావడంతో ఫిరోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కేసు నుంచి తప్పించుకోవాలని చూసిన ప్రీతి శర్మ ట్రాలీ బ్యాగ్‌తో శవాన్ని మాయం చేసేందుకు ఫ్లాన్ చేసింది. మృతదేహం బయట తీసుకెళ్తున్న క్రమంలో పోలీసులకు చిక్కింది.












Click it and Unblock the Notifications