అత్త ఫ్యామిలీలో నలుగురిని చంపేశాడు, ఫస్ట్ చాన్స్ భార్యకే ఇచ్చిన భర్త, అసలు మ్యాటర్ !!
వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. అయితే దంపతుల మధ్య తేడాలు రావడంతో గొడవలు మొదలైనాయి, పెద్దలు రాజీ పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. నిత్యం భర్తతో గొడవలు పడుతున్న భార్య చివరికి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య మీద రగిలిపోయిన భర్త ఆమె అంతం చూడాలని అనుకున్నాడు. భార్యతో పాటు ఆమె ఫ్యామిలీలోని నలుగురిని దారుణంగా చంపేశాడు.
మహారాష్ట్రాలోని యవత్మాల్ జిల్లాలోని కలంబ్ ప్రాంతంలో సవిత అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన గోవింద్ పవార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సవిత అంగీకరించింది. ఇద్దరూ పెళ్లికి అంగీకరించడంతో అప్పట్లో కుటుంబ సభ్యులు, బందువులు, స్నేహితుల సమక్షంలో గోవింద్ పవార్, సవితాల వివాహం గ్రాండ్ గా జరిగింది.

వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల పాటు గోవింద్ పవార్, సవితా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. తరువాత సంసారంలో చిన్నిచిన్న గొడవలు మొదలుకావడంతో రచ్చ మొదలైయ్యింది. చిన్నిచిన్న గొడవలు రానురాను పెద్దవి అయ్యాయి. సవితా కుటుంబ సభ్యులు, గోవింద్ పవార్ కుటుంబ సభ్యులు కలిసి పంచాయితీలు చేస్తూ ఇద్దరిని రాజీ చేస్తూ వచ్చారు.
అయితే భర్త గోవింద్ పవార్ తో పెద్ద గొడవ చేసిన సవిత కలంబ్ ప్రాంతంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య నా పరువు తీసిందని గోవింద్ పవార్ రగిలిపోయాడు. అయితే ఇన్ని రోజులు భార్యకు దూరంగా ఉంటున్న గోవింద్ పవార్ తరువాత అత్తారింటికి వెళ్లాడు. పుట్టింటిలో ఉన్న భార్య, మామ (భార్య తండ్రి)తో పాటు అడ్డు వచ్చిన మరో ఇద్దరిని దారుణంగా హత్య చేసిన గోవింద్ పవార్ అక్కడి నుంచి పారిపోయాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు అందరి శవాలను ఆసుపత్రికి తరలించారు. నలుగురిని హత్య చేసి పారిపోయిన గోవింద్ పవార్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే భార్య కోసం గోవింద్ పవార్ నలుగురిని హత్య చేశాడా ?, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని, కేసు దర్యాప్తులో ఉందని యవత్నాల్ జిల్లా పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications