Wife: రొమాన్స్, 180 ఎకరాల భూస్వామితో భార్య జల్సా, తోటలో వెంటాడి నరికి చంపిన భర్త !
బెంగళూరు/కోలారు: ఆ ఊరిలో అందరికంటే అతను జమీందారు. పది, ఇరవై ఎకరాలు కాదు. ఏకంగా 180 ఎకరాల భూమికి అతను యజమాని. వందాలాది మంది ఆ జమీందారు పొలంలో కౌలుకు వ్యవసాయం చేస్తుంటే ఇంకా కొందరు అతని దగ్గర కూలిపనులు చేస్తున్నారు. అంతటి భూస్వామిని, అతని ప్రియురాలని పట్టపగలు, మిట్ట మద్యాహ్నం దారుణంగా హత్య చేశారు. అక్రమ సంబంధం కారణంగా180 ఎకరాల భూస్వామి పట్టపగలు అతని తోటలో దారుణ హత్యకు గురి కావడంతో కలకలం రేపింది. భార్య అక్రమ సంబంధం గురించి చాలా సంవత్సరాల క్రితమే తెలిసినా ఇద్దరిని ఒకేసారి చంపేయాలని భర్త ఇంతకాలం వేచి చూశాడని పోలీసులు అన్నారు.

180 ఎకరాల భూస్వామి
కర్ణాటకలోని యాదగిరి జిల్లాలోని సురపుర తాలుకాలోని కాచాపుర అనే గ్రామంలో నాగేగౌడ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నాడేగౌడ ఆ పరిసర గ్రామాల్లోనే అతి పెద్ద భూస్వామి, జమీందారుల వంశంలో పుట్టిన నాడేగౌడకు 180 ఎకరాల పొలం, భూములు, తోటలు ఉన్నాయి. యాదగిరి జిల్లాలోని అతి పెద్ద కోటీశ్వరుల్లో నాడేగౌడ ముందు వరుసలో ఉన్నాడు.

ఎర్రగా పొడవుగా ఉందని వల వేసిన కోటీశ్వరుడు
అదే గ్రామంలో మల్లన్న, బసమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. మల్లన్న, బసమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. భూస్వామి దగ్గర మల్లన్న భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మల్లన్న భార్య బసమ్మ చూడటానికి ఎర్రగా, పొడవుగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం భూస్వామి నాడేగౌడ మల్లన్న భార్య బసమ్మను వలలో వేసుకున్నాడు..

కోటీశ్వరుడి కోరికలు తీర్చుతున్న ప్రియురాలు
అప్పటి నుంచి బసమ్మ కోటీశ్వరుడు నాడేగౌడతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. బసమ్మ ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇస్తున్న నాడేగౌడ ఆమెతో సరాసరాలు ఆడుతున్నాడు. మద్యాహ్నం పొలం దగ్గరకు వెళ్లిన బసమ్మ ఆమె భర్త మల్లన్నకు భోజనం పెట్టి తరువాత నేను ఇంటికి వెలుతున్నానని ఆమె భర్తకు చెప్పింది.

వెంటాడి వెంటాడి ఇద్దరిని నరికి చంపేసిన భర్త
పొలం దగ్గర నుంచి ఇంటికి బయలుదేరిన బసమ్మ నేరుగా ప్రియుడు నాడేగౌడ పత్తితోటలోకి వెళ్లింది. మిట్టమద్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటంతో పత్తితోటలో నాడేగౌడ, అతని ప్రియురాలు బసమ్మ మంచి రసపట్టులో ఉన్నారు. ఆ సందర్బంలో కొడవితో ఎంట్రీ ఇచ్చిన మల్లన్న అతని భార్య బసమ్మ, ఆమె ప్రియుడు నాడేగౌడను అదేతోటలో వెంటాడి వెంటాడి అదే తోటలో నరికి చంపేశాడు.

కుక్కచావు చచ్చిన భూస్వామి
భార్య, ఆమె ప్రియుడు నాడేగౌడను దారుణంగా నరికి చంపేసిన మల్లన్న మొదట తప్పించుకుని పారిపోయాడు. భూస్వామి నాడేగౌడ నాచేతిలో కుక్కచావు చచ్చాడని మల్లన్న పోలీసులకు చెప్పాడు. భార్య బసమ్మ అక్రమ సంబంధం గురించి మల్లనకు చాలా సంవత్సరాల క్రితమే తెలుసని, ఇద్దరిని చంపేయాలని ఇంతకాలం వేచి చూశాడని పోలీసులు అన్నారు. తరువాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మల్లన్న లొంగిపోయాడు. అక్రమ సంబంధం కారణంగా180 ఎకరాల భూస్వామి పట్టపగలు అతని తోటలో దారుణ హత్యకు గురి కావడంతో యాదగిరి జిల్లాలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications