బెడ్ రూమ్ లో ఆయుధపూజ రోజు ఆయుధంతో భార్యను చంపేసిన భర్త, ఇంతలో ?
బెంగళూరు/మైసూరు: వివాహం చేస్తే కుమార్తె సంతోషంగా ఉంటుందని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. కూతురి పిల్లలతో సంతోషంగా ఆడుకోవచ్చని, అందరితో కలిసి హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుందని ఆమె తల్లిదండ్రులు ఊహించుకున్నారు. అయితే వివాహం జరిగి మూడు సంవత్సరాలు కూడా కాకుండానే అల్లుడి చేతిలో కూతురు హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు హడలిపోయారు.
కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర జిల్లా (తమిళనాడు బార్డర్)లోని హోసూరు గ్రామంలో కార్తీక్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కార్తీక్ పూర్వికులు తమిళనాడు వాసులు కావడంతో అతని కుటుంబ సభ్యులు తమిళ, కన్నడ, తెలుగు బాషలు మాట్లాడుతున్నారు. కార్తీక్ తాతలు తెలుగు వారు అని తెలిసింది.

ఇలా కార్తీక్ మూడు బాషలు మాట్లాడుతున్నాడు. మూడు సంవత్సరాల క్రితం తమిళనాడుకు చెందిన రాధిక (23) అనే యువతిని కార్తీక్ కు ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఇరువైపుల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. కార్తీక్ ను పెళ్లి చేసుకోవడానికి రాధిక కూడా ఓకే చెప్పింది. మూడు సంవత్సరాల క్రితమే కార్తీక్, రాధికల వివాహం అందరి సమక్షంలో జరిగింది.
వివాహం చేసుకున్న రాధిక, కార్తీక్ దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో 10 నెలల క్రితం కుమార్తె పుట్టింది. అయితే మూడు నాలుగు నెలల నుంచి కార్తీక్, రాధిక దంపతుల మధ్య ఓ విషయంలో గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. నిత్యం దంపతులు గొడవపడటంతో కార్తీక్ కుటుంబ సభ్యులు ఇద్దరికి నచ్చ చెబుతూ వస్తున్నారు.

సోమవారం దసరా పండుగ సందర్బంగా ఊరిలో పెద్ద పండుగ చేశారు. బంధువుల ఇంటిలో జరుగుతున్న పూజలకు వెళ్లిన రాధిక తరువాత ఇంటికి వెళ్లింది. అయితే అర్దరాత్రి కార్తీక్, రాధిక దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన కార్తీక్ భార్యను చితకబాదేశాడు. ఆయుధపూజ రోజు బలమైన ఆయుధం తీసుకున్న కార్తీక్ అతని భార్య రాధిక తల మీద దాడి చేసి ఆమెను స్పాట్ లో చంపేశాడు. చామరాజనగర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications