చీరతో భార్య గొంతు బిగించి చంపేసి గుమ్మంలో వేలాడదీసిన భర్త, మ్యాటర్ !
చెన్నై/ పుదుచ్చేరి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు పెళ్లి వయసుకు వచ్చిన కుమారుడు ఉన్నాడు. ఇప్పటికే కుమార్తెకు వివాహం చేసి ఆమెను అత్తారింటికి పంపించేశారు. పెళ్లి వయసుకు వచ్చిన కొడుకును ఇంట్లో పెట్టుకుని దంపతులు ఆడిందిఆటగా పాడింది పాటగా తయారైయ్యింది. ఇంటి గుమ్మం ముందు చీరకు వేలాడుతూ భార్య శవమై కనిపించింది.
పుదుచ్చేరిలోని మంగళం నియోజకవర్గం పరిధిలోని అనంతపురం గ్రామం, ఆనంద నగర్ లోని భారతి రోడ్డులో రాజేంద్రన్, కలియరసి దంపతులు నివాసం ఉంటున్నారు. రాజేంద్రన్, కలియరసి దంపతులకు. కి రాజశేఖర్ (25) అనే కుమారుడు ఉన్నాడు. కలియరసి, రాజేంద్రన్ దంపతుల కుమార్తెకు ఇప్పటికే వివాహం కావడంతో ఆమె భర్తతో కాపురం చేస్తూ అత్తారింటిలో ఉంటున్నది.

నివాసం ఉండే ఇంటి గుమ్మం ముందే కలియరసి అనుమానాస్పదంగా మృతి చెంది శవమై ఉండటం చూసిన ఇరుగుపొరుగు వారు విలియనూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కలియరసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కతిర్‌గామం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కలియరసి అనుమానాస్పదంగా మృతి చెందిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే పోలీసులు కలియరసి భర్త రాజేంద్రన్ ను పిలిపించి విచారించారు. డోర్ వద్ద ఉన్న పైకప్పకు చీరతో ఉరివేసుకుని తన భార్య కలియరసి ఆత్మహత్య చేసుకుందని రాజేంద్రన్ పోలీసుల ముందు డ్రామాలు ఆడాడు.
భర్త రాజేంద్రన్ చెప్పిన సమాధానం విన్న పోలీసులకు రాజేంద్రన్‌పై అనుమానం వచ్చింది. తరువాత పోస్ట్‌మార్టం రిపోర్టు రాగా కలియరసిని చిత్రహింసలకు గురిచేసి ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు రాజేంద్రన్‌ను మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.
తాను ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత తన భార్య కలియరసి ఎక్కువగా బయటతిరుగుతోందని, ఆమెకు అక్రమ సంబందం ఉందని, అంతే కాకుండా తనకు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వడం లేదని, ఈ విషయాలతోనే తన భార్యతో గొడవపడి ఆమెను వెనుక నుంచి చీరతో గొంతు బిగించి హత్య చేసి చంపినట్లు నిందితుడు రాజేంద్రన్ అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు. కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications