మీసం మెలేసిన మహిళ రోషం; మీసం లేకుండా బ్రతకలేనంటూనే.. విమర్శించేవారికి షాకింగ్ సలహా!!
సహజంగా ఆడవాళ్లు కొద్దిపాటి మీసం, గడ్డం వచ్చినా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అవాంచిత రోమాలను తీసి వేయడం కోసం నానా తంటాలు పడతారు. బ్యూటీ పార్లర్ చుట్టూ పరుగులు పెడతారు. కొద్దిగా అవి బయట జనాలకు కనిపించినా అవమానంగా ఫీల్ అవుతారు. కానీకన్నూర్ లోని కుతుపరంబకు చెందిన షైజా అనే మహిళ తన మీసాల విషయంలో గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెబుతోంది. ఎటువంటి సిగ్గులేకుండా, ఎవరెన్ని విమర్శలు చేసినా, మీసం మెలేసి మరి తిరుగుతోంది. ఇంకా చెప్పాలంటే మీసాలు లేకుంటే తాను బ్రతకలేనని, అంతగా తన మీసాల పట్ల తనకు ప్రేమ ఉందని షైజా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

యువతులకు అవాంచిత రోమాలు .. అవమానంగా ఫీలై ఆస్పత్రులలో ట్రీట్మెంట్ లు
చాలా మంది యువతులకు ముఖం మీద, మూతి మీద, గడ్డం మీద అవాంఛిత రోమాలు పెరుగుతూంటాయి. హార్మోనల్ ఇన్ బాలన్స్ కారణంగా ఆ విధంగా మీసాలు, గడ్డాలు మహిళలకు వస్తాయని చెబుతారు. అయితే సహజంగా మహిళలు ఎవరు వాటిని ఉంచుకోవడానికి ఇష్టపడరు. అవి బయటకు కనిపిస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఆత్మన్యూనతా భావానికి గురవుతుంటారు. ఇక అవాంఛిత రోమాలను తొలగించుకోవడం కోసం బ్యూటీ పార్లర్ లను ఆశ్రయిస్తుంటారు. కొన్ని సందర్భాలలో ఆసుపత్రులకు వెళ్లి లేజర్ ట్రీట్మెంట్ లు సైతం తీసుకుంటూ ఉంటారు.

మీసం ఉన్న మహిళ షైజా .. మీసం మెలేసి విమర్శలకు సమాధానం
ఇక అలాంటివారు ఎక్కడైనా తారసపడితే అందరూ అవహేళన చేస్తారు. మీసమున్న యువతులను మగవాళ్లు గా, ట్రాన్స్ జెండర్ లుగా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎందరు ఎంతగా అవహేళన చేసినా షైజా మాత్రం తన మీసం పట్ల గర్వం వ్యక్తం చేస్తున్నారు. జనం తనవైపు అవిశ్వాసంతో చూస్తున్నప్పటికీ, షైజా తన మీసాలను తొలగించబోనని తేల్చి చెబుతున్నారు. మీసాల వల్ల తనకు ఎటువంటి సమస్య లేదని, తన భర్త తన కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదని, అలాంటప్పుడు మీకు ఎందుకు అంత బాధ అంటూ తనపై విమర్శలు చేసే వారికి సమాధానం చెబుతున్నారు.

మీసం అంటే తనకు ప్రేమ అంటున్న షైజా.. మీసం లేకుంటే బ్రతకలేనని సమాధానం
తాను తన మీసాలను ప్రేమిస్తున్నానని, అత్యంత విలువైనవి తన మీసాలని షైజా చెబుతున్నారు. తన కుమార్తెను పాఠశాలలో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు, అనేకసార్లు ఆలయ ఉత్సవాలకు వెళ్ళినప్పుడు చాలా మంది తన వైపు వింతగా చూస్తారని, రకరకాల కామెంట్లు చేస్తారని అయినా వాటిని తాను సీరియస్ గా తీసుకోనని షైజా చెబుతున్నారు. ఇటీవల షైజా కు గర్భాశయ శస్త్ర చికిత్స జరిగింది. ఈ క్రమంలో వైద్యుడు మీ మీసాలు కూడా తొలగించాలా అని సరదాగా అడిగారు. తాను లేచేసరికి తన మూతి మీద మీసం లేకుంటే ఉరేసుకుంటానని షైజా షాకింగ్ సమాధానం చెప్పింది.

మీసం మెలేసి రోషాన్ని ప్రదర్శించడం తనకు ఇష్టమని, అదే తన స్టైల్ అంటున్న షైజా
యుక్తవయస్సులో లైట్ గా ఉన్న మీసాలు, వయసుతో పాటు పెద్దగా పెరిగాయని, అయినా వాటిని తాను తొలగించాలని అనుకోలేదని షైజా పేర్కొంది. మీసం మెలేసి రోషాన్ని ప్రదర్శించడం తనకు ఇష్టమని, అదే తన స్టైల్ అని చెబుతోంది. ఇక తన మీసాలను గురించి భర్త ఎప్పుడూ నెగటివ్ కామెంట్స్ చేయలేదని, తొలగించాలని ఒత్తిడి చేయలేదని, బిడ్డ సైతం తన మీసాలపై ప్రేమను వ్యక్తం చేస్తోందని షైజా పేర్కొంది. తనలాంటి వారు ఎవరూ మనస్థాపంతో కృంగి పోవాల్సిన అవసరం లేదని, బాధ పడవలసిన అవసరం లేదని చెబుతున్న షైజా ధైర్యంగా మీసం మెలెయ్యండి అని చెబుతోంది. ఇక పనిలేకుండా మహిళలకు వచ్చే మీసాలపై విమర్శలు చేసేవారు ఏదైనా పని చూసుకుంటే మంచిదని సలహా ఇస్తోంది షైజా.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications