Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భర్తకు విడాకులు, కొడుకును చంపేసి శవం సూట్ కేస్ లో ప్యాక్ చేసిన కంపెనీ లేడీ సీఈవో, అసలు డీల్ !

హోటల్‌లో కన్న బిడ్డను హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో తీసుకెళ్తున్న స్టార్టప్ కంపెనీ ఎండీ అండ్ సీఈవో సుచనా సేఠ్ అనే మహిళను తుమకూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి తరువాత గోవా పోలీసులకు అప్పగించారు. తల్లి చేతిలో హత్యకు గురైన చిన్నారిని చిన్మయ్ రమణన్ సేఠ్ (4)గా గుర్తించామని కర్ణాటక పోలీసు అధికారులు తెలిపారు.

సుచనా సేఠ్ గోవాలోని ఓ హోటల్‌లో నాలుగేళ్ల కొడుకును హత్య చేసింది. తరువాత చిన్నారి చిన్నయ్ మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ప్యాక్ చేసింది. సూట్ కేసులో కొడుకు శవాన్ని పెట్టుకుని గోవా నుంచి బెంగళూరుకు వెళుతుండగా చిత్రదుర్గా జిల్లాలోని ఐమంగళ పోలీసులు సుచనా సేఠ్ ను అరెస్టు చేశారు. నిందితురాలు సుచనా సేఠ్ గోవా నుంచి టాక్సీలో బెంగళూరుకు బయలుదేరింది. ఆ సమయంలో గోవాలో ఉంటున్న హోటల్‌ యజమాని, సిబ్బందికి సుచనా సేఠ్ మీద అనుమానం వచ్చి గోవా పోలీసులకు సమాచారం అందించారు.

A lady CEO of a startup company who killed her son in Goa and packed the body in a suit case and left for Bengaluru.

గోవాలో సుచనా సేఠ్ బసచేసిన హోటల్ గదిలో రక్తపు మరకలు కనిపించడంతో ఆ హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. గదిలోకి తీసుకెళ్లిన చిన్నారి కొన్ని రోజులు ఉన్నాడని, తరువాత సుచనా సేఠ్ బయటకు తిరిగి వస్తుండగా అక్కడ ఆ బాలుడు కనిపించకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. తరువాత మీ కుమారుడు చిన్నయ్ ఎక్కడా అని హోటల్ సిబ్బంది ప్రశ్నించగా తన బంధువుల ఇంటికి పంపినట్లు సుచనా సేఠ్ వాళ్లకు అబద్ధం చెప్పింది.

ఆ తర్వాత టాక్సీ మాట్లాడుకున్న సుచనా సేఠ్ గోవాలో ఆమె బసచేసిన హోటల్ గది ఖాళీ చేసి బెంగళూరు బయలుదేరింది. హోటల్ సిబ్బంది గోవా పోలీసులను సంప్రదించారు. పోలీసులు సుచనా సేఠ్ వెలుతున్న ట్యాక్సీ డ్రైవర్ కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని ఆరా తీశారు. ఆ సమయంలో గోవా- బెంగళూరు హైవే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్‌లో కారు ఆపమని గోవా పోలీసులు ట్యాక్సీ డ్రైవర్ కు సూచించారు. నాలుగవ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న ఐమంగళ స్టేషన్ సమీపంలో సుచనా సేఠ్ ప్రయాణిస్తున్న ట్యాక్సీని డ్రైవర్ ఆపేశాడు.

A lady CEO of a startup company who killed her son in Goa and packed the body in a suit case and left for Bengaluru.

అనంతరం డ్రైవర్ అతని ట్యాక్సీలో ఉన్న నిందితురాలిని ఐమంగల పోలీసులకు అప్పగించాడు. కారులో పరిశీలించిన పోలీసులు అందులోని సూట్‌కేస్‌లో ఉన్న చిన్నారి చిన్నయ్ మృతదేహం స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి చిన్నయ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించి నిందితురాలు సుచనా సేఠ్ ను ఐమంగల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు సుచనాను గోవా పోలీసులకు అప్పగించేందుకు ఐమంగళ పోలీసులు అన్ని సిద్దం చేశారు.

చిన్నయ్ సేఠ్ అనే బాలుడిని అతని తల్లి, కంపెనీ సీఈవో సుచనా సేఠ్ హత్య చేసిందని గోవా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిందితురాలు సుచనా సేఠ్ సొంత ఊరు కోల్‌కతా అని, కోల్ కత్తాకు చెందిన సుచనా సేఠ్ బెంగళూరులో పీహెచ్‌డీ చదువుతోందని, ఆమె భర్తకు విడాకులు ఇచ్చి బెంగళూరులో స్థిరపడిందని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఇటీవల ఓ స్టాటప్ కంపెనీని స్థాపించిన సుచనా సేఠ్ కొడుకుతో కలిసి బెంగళూరులోనే నివాసం ఉంటోందని, విడాకులు తీసుకున్న తరువాత ఆమె భర్త ఇండోనేషియాలో ఉన్నట్లు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. నిందితురాలు సుచనా సేఠ్ గోవా పర్యటనకు వెళ్లిన సమయంలో ఆమె కొడుకు చిన్నయ్ ని చంపేసిందని పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+