మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ కామపురాణం, డెత్ నోట్ రాసి లేడీ డాక్టర్ చేసిన పనికి షాక్ !
చెన్నై/ కన్యాకుమారి: తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాకు చెందిన సుకీర్త అనే యువతి ,చెన్నై (chennai) ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసిన సంకీర్ణ తరువాత రెండేళ్లు డాక్టర్‌గా పనిచేసింది. తమిళనాడులోని కన్యాకుమారిలో పీజీ చెయ్యాలని సంకీర్ణ నిర్ణయించింది. అనస్థీషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సు కోసం కులశేఖరలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సంకీర్ణ చేరింది.
మెడికల్ కాలేజ్ (medical college) విద్యార్థిని సంకీర్ణ తరగతికి వెళ్లకుండా హాస్టల్ (hostel)లోనే ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు హాస్టల్ (hostel)గదికి వెళ్లి చూడగా సంకీర్ణ రూమ్ లోపల డోర్ గడియపెట్టి ఉండడం, ఎన్నిసార్లు పిలిచినా, డోర్ తట్టినా తలుపులు తెరవకపోవడంతో సాటి విద్యార్థులు అనుమానం వచ్చి కళాశాల (medical college)యాజమాన్యానికి సమాచారం అందించారు.

పోలీసుల సహాయంతో తలుపు తాళం పగులగొట్టి చూడగా విద్యార్థిని సుకీర్త ఆమె ఉంటున్న రూమ్ లో శవమై కనిపించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు తాను నేర్చుకున్న డాక్టర్ శిక్షణను తన ప్రాణాలను బలిగొనడానికి సంకీర్ణ ఉపయోగించరుకుందని పోలీసులు వెల్లడించారు. శాస్త్ర చికిత్స సమయంలో ఉపయోగించే మత్తు మందుతో విద్యార్థిని సంకీర్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
సంకీర్ణ గదిలో (hostel)సోదాలు చేయగా ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన డెత్ నోట్ లభ్యమైంది. అందులో 65 ఏళ్ల ప్రొఫెసర్ (professor) పరమశివన్ తనను లైంగికంగా వేధించాడని సుకీర్త పేర్కొంది. సీనియర్ విద్యార్థులు( student) హరీష్, ప్రీతి కూడా తనను మానసికంగా వేధించారని సుకీర్త లేఖ ద్వారా ఆరోపించింది. విద్యార్థిని సంకీర్ణ ఆత్మహత్య లేఖ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
సంకీర్ణ ఆత్మహత్య కేసులో 65 ఏళ్ల ప్రొఫెసర్‌తో (professor) సహా ముగ్గురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు కళాశాల (medical college)యాజమాన్యం, తోటి విద్యార్థులతో విచారణ చేపట్టారు. సంకీర్ణ ఆత్మహత్య చేసుకోవడానికి మూడు రోజుల ముందు ఖాళీ టంబ్లర్‌ను సాటి స్నేహితులకు చూపించి నా జీవితం ఇలా ఖాళీ అయిపోయిందని ఆదేవన వ్యక్తం చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ (medical college) విద్యార్థి జీవితాన్ని జీవితాన్ని నాశనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ సంకీర్ణ ఆత్మహత్య కేసును సీబీఐకి (CBI) బదిలీ చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు. కాలేజీల్లో విద్యార్థినుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఐపీఎస్ అధికారి రవి కూడా తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్లతో (professor) సహా మొత్తం ముగ్గురు వ్యక్తులను కళాశాల నుండి సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications