lady teacher: భర్తను మోసం చేసి ప్రియుడితో ఎంజాయ్ చేసిన లేడీ టీచర్ ప్రాణం పోయింది, మొన్న !

బెంగళూరు/దావణగెరె: భర్తను పట్టించుకోకుండా అతన్ని మోసం చేసి ఇద్దరు ప్రియులతో జల్సా చేసిన లేడీ టీచర్ ప్రాణాలు పోయాయి. తల్లి చేసిన తప్పుడు మొన్న కొడుకు ప్రాణం పోయింది. కొడుకు చనిపోయిన రెండు రోజులకు తప్పు చేసిన లేడీ టీచర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లేడీ టీచర్, ఆమెను హత్య చేసిన టీచర్ ప్రియుడికి పోలీసులు బెండ్ తీస్తున్నారు.

కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని నరుంద తాలుకాలోని హద్లీ గ్రామంలో ప్రభుత్వ స్కూల్ ఉంది. వివాహం చేసుకున్న గీతా అనే మహిళ ఇదే ప్రభుత్వ స్కూల్ లో పార్ట్ టైమ్ టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. ఇదే స్కూల్ ఉద్యోగం చేస్తున్న ముత్తప్ప అనే టీచర్ తో గీతా అక్రమ సంబంధం పెట్టుకుంది. ముత్తప్పకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

A lady teacher who was injured by her boyfriend died after treatment failed. The teachers son died two days ago in Karnataka.

గీతా, ముత్తప్పల అక్రమ సంబందం చాలాకాలం నుంచి కొనసాగుతోంది. అదే స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న సంగనగౌడ అనే వ్యక్తితో గీతా చనువు పెంచుకుని అతనితో కూడా ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. స్కూల్ లో పిల్లలు, టీచర్లు కలిసి మూడు రోజులు విహారయాత్రకు వెళ్లారు. విహారయాత్రకు వెళ్లిన సమయంలో పాత ప్రియుడు ముత్తప్పను దూరం పెట్టిన గీతా కొత్త ప్రియుడు సంగనగౌడతో రొమాన్స్ చెయ్యడంతో అక్కడ గొడవలు మొదలైనాయి.

గీతాకు అదే స్కూల్ లో నాలుగవ తరగతి చదవుతున్న భరత్ అనే కుమారుడు ఉన్నాడు. గీతా, ఆమె కొడుకు భరత్ మీద అదే స్కూల్ లో ముత్తప్ప ఇనుపరాడ్, కత్తితో దాడి చేశాడు. భరత్ ను స్కూల్ మొదటి అంతస్తు బాల్కనీ మీద నుంచి కిందకు తోసేశాడు. తీవ్రగాయాలైన గీతా, ఆమె కుమారుడు భరత్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై భరత్ చనిపోయాడు.

ఇప్పటికే ఈ కేసులో టీచర్ ముత్తప్పను పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడి చేతిలో తీవ్రగాయాలైన గీతా దావణగెరెలోని ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందింది. అయితే చికిత్స విఫలమై కొడుకు చనిపోయిన రెండు రోజులకే లేడీ టీచర్ గీతా ప్రాణాలు పోయాయి. భర్తను పట్టించుకోకుండా ఇద్దరు ప్రియులతో జల్సా చేసిన లేడీ టీచర్ గీతా చనిపోవడంతో ముత్తప్ప మీద డబుల్ మర్డర్ కేసులతో పాటు గీతా కొత్త ప్రియుడి మీద హత్యాయత్నం చేశాడని కేసులు నమోదు అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+