సాఫ్ట్ వేర్ కంపెనీలో భార్య ఉద్యోగి, వీడికి ఇంకా కట్నం కావాలంట, రెండేళ్లకు జీవితం ?
భర్త, అతని కుటుంబ సభ్యులు వరకట్నం వేధింపులకు గురి చెయ్యడంతో విరక్తి చెందిన వివాహిత టెక్కీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులో జరిగింది. పూజా(22) ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరు లేనప్పుడు పూజా ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారని పోలీసు అధికారులు తెలిపారు.
బెంగళూరు నగరంలోని గంగమ్మన గుడి మెయిన్ రోడ్డులోని ఇంట్లో ఈ సంఘటన జరిగిందని పోలీసులు అన్నారు. కర్ణాటకలోని విజయనగర జిల్లా పూలహడగలి తాళ్లకు చెందిన పూజా ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అన్నారు. పూజా భర్త సునీల్‌తో పాటు మరిది అనిల్ తదితరులు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశారని యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

2022 లో పూజా, సునీల్ వివాహం జరిగింది. పెళ్లి సమయంలో పూజా కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో నగదు, నగలు కట్నం కింద సునీల్ కుటుంబ సభ్యులకు ఇచ్చారని తెలిసింది. పూజా కుటుంబ సభ్యులు పెళ్లికూడా చాలా గ్రాండ్ గా చేశారని ఆమె కుటుంబ సభ్యులు, అమె బంధువులు అంటున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత కొంతకాలం సునీల్ అతని భార్య పూజాను బాగానే చూసుకున్నాడని తెలిసింది.
బెంగళూరులో టెక్కీగా ఉద్యోగం చేస్తున్న పూజా ఆమె భర్త సునీల్ తో పాటు అతని కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మన గుడి మెయిన్ రోడ్డులోనే నివాసం ఉంటున్నదని తెలిసింది. పూజా ఆమెకు వచ్చే జీతం మొత్తం భర్త సునీల్ కు ఇస్తోందని, అయినా కూడా అదనపు కట్నం కోసం ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న టెక్కీ పూజా మృతదేహం పోస్టుమార్టుం కోసం రామయ్య ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు పోలీసు తెలిపారు.












Click it and Unblock the Notifications