పోలీస్‌స్టేషన్‌లోనే పోలీస్‌ను చితగ్గొట్టిన వ్యక్తి.. వీడియో వైరల్; సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ!!
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని మొయిన్ పురిలో ఓ వ్యక్తి పోలీసులపై వీరంగం వేశాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే పోలీసును చితకబాదాడు. తనను విచారించడానికి పిలిచిన పోలీసుపై సదరు వ్యక్తి దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పోలీస్ స్టేషన్ లోనే పోలీసుపై దాడికి పాల్పడిన వ్యక్తి
ఘటన వివరాల్లోకి వెళితే గృహహింస కేసుకు సంబంధించి పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలిచిన ఓ వ్యక్తి, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో ఒక పోలీసుపై దాడికి పాల్పడ్డాడు. సదరు వ్యక్తిపై అందిన గృహ హింస ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల కౌన్సిలింగ్ తో విసిగిపోయిన వ్యక్తి ఏకంగా పోలీసుపై దాడికి పాల్పడ్డాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అతడిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ అతను పోలీసుపై దాడి చేశాడు.

గృహ హింస కేసులో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసుపై దాడి .. వీడియో వైరల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక పోలీసుతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. కొద్దిసేపటి తర్వాత, ఆ వ్యక్తి తన నిగ్రహాన్ని కోల్పోయి, పోలీసులపై అక్కడే ఉన్న ప్లాస్టిక్ కుర్చీతో దాడి చేయడం ప్రారంభించాడు. ఆపకుండా పోలీసును చావగొట్టాడు. ఇక అక్కడే ఉన్న పోలీసులు దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సదరు వ్యక్తిని కంట్రోల్ చేసె ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కుర్చీ అడ్డుపెట్టి కొట్టకుండా ఆపే ప్రయత్నం చేసింది.

మానసిక ఆరోగ్య బాగాలేదని చెప్తున్న కుటుంబం.. ఆధారాలు చూపాలన్న పోలీసులు
మొయిన్‌పురి ఏఎస్పీ మధువన్ కుమార్, తెలిపిన వివరాల ప్రకారం, గృహ హింస ఫిర్యాదుపై అతన్ని పిలిచి విచారిస్తున్నామని, ఈ క్రమంలో అతడు లోపల ఉన్న ఒక పోలీసు అధికారిని కొట్టారని పేర్కొన్నారు. వ్యక్తి మానసిక అనారోగ్యంతో ఉన్నాడని అతని కుటుంబం పోలీసులకు చెప్పారని పేర్కొన్న ఆయన , అయితే అతను నిజంగానే మానసిక అనారోగ్యంతో ఉన్నాడని, అందుకు సంబంధించిన మెడికల్ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తే మేము దానిని పరిగణనలోకి తీసుకుంటాము అని పేర్కొన్నారు.
ఇక పోలీసులపై దాడి చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు మొయిన్‌పురి పోలీసులు వెల్లడించారు. పట్టరాని కోపంతో పోలీసుపై దాడికి పాల్పడిన వ్యక్తి చివరకు కటకటాల పాలయ్యాడు.
ఇదేనా యూపీ పోలీసుల పరిస్థితి.. నెటిజన్ల స్పందన
ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదేనా మీ పోలీసుల పరిస్థితి? అంటూ యూపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. యూపీ పోలీసులను ఎవరైనా కొడతారు. కానీ మరో పోలీసు కూడా అతనికి సహాయం చేయలేదు. కుర్చీతో కొట్టటానికి వెళ్లి అదే కుర్చీతో దెబ్బలు తిన్నాడు. ఇలాంటి పోలీసులను చూసి జిహాదీ గూండాలు భయపడతారని అనుకుంటున్నారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ఆవేశం అనర్ధాలకు దారి తీస్తుందని చెప్తున్నారు. ఆవేశం ఫలితం జైలు పాలయ్యాడని చెప్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications