ఘోరం: భార్యను ముక్కలుగా నరికేసి, నదిలో పడేశాడు
బెళగావి: కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అతి కిరాతకంగా ఓ వ్యక్తి తన భార్యను ముక్కలు ముక్కులుగా నరికేశాడు. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
కోచేరి గ్రామంలో ఆగస్టు 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం రాత్రి వెలుగుచూసింది. నిందితుడు అరుణ్ మద్గమ్ తన నేరాన్ని అంగీకరించాడు.

తన భార్య అక్కుటాయి మద్గమ్(49)ను ముక్కలుగా నరికేసి ఓ సంచిలో వేసి హిరణ్యకేసి నదిలో పడేసినట్లు వివరించాడు. తనను ఎప్పుడూ వేధింపులకు గురిచేసేదని, అందుకే ఆమెను చంపినట్లు నిందితుడు అరుణ్ చెప్పాడు.
కాగా, వరకట్నం కోసం వేధింపులకు గురిచేసి అక్కుటాయిని ఆమె భర్త అరుణ్ దారుణంగా చంపేశాడని బాధితురాలి సోదరుడు ఆరోపించాడు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications