Viral Vidoe: ప్రభుదేవా పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన అంకుల్.. డ్యాన్స్ అదిరిందన్న క్రికెటర్ సంజూ శాంసన్..
సోషల్ మీడియా వచ్చిన నుంచి ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. వింతైనా, విశేషమైనా.. బాధైనా..సంతోమైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొందరైతే తమ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది సోషల్ మీడియాలో తమ టాలెంట్ ను ప్రదర్శించి స్టార్లైన వారు కూడా ఉన్నారు. తాజా ఓ సామాన్య వ్యక్తి చేసిన డ్యాన్స్ చూస్తే హీరోలు మరిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఓ సాధారణ వ్యక్తి.. రోడ్డుపై ప్రభుదేవా సాంగ్ కి చేసిన డ్యాన్స్ నెటిజన్స్ మనసులను గెలుచుకుంది. సోషల్ మీడియాలో 13 లక్షల మంది ఈవీడియోని వీక్షించారు. వీడియోలో దాదాపు 40 నుంచి 50 ఏళ్లున్న వ్యక్తి ' జెంటిల్ మెన్' సినిమాలోని 'చిక్కు బుక్కు రైలే' పాటకి డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాను అనుకరిస్తూ డ్యాన్స్ చేశాడు. అతని మూన్ వాక్ డ్యాన్స్ కి చుట్టు ఉన్న వారు అతడిని ప్రోత్సాహించారు. ఈవీడియోని రాజుకుమార్ అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో 'డ్యాన్సర్ రమేష్' అన్న క్యాప్షన్ తో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈ వీడియోపై పట్ల నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు."అంకుల్ వాకింగ్ స్టైల్ అదిరందంటూ ఓనెటిజన్ కామెంట్ చేయగా.. మరోనెటిజన్ 'ఎజ్ ఇస్ జస్ట్ నెంబర్' అంటూ మరో వ్యక్తి క్యాప్షన్ కామెంట్ చేశారు. తెలుగు యాక్టర్ రచ్చరవి హార్ట్ ఎమోజీతో కామెంట్ చేయగా.. క్రికెటర్ సంజూ శాంసన్ స్మైల్, ఒకే హ్యాండ్ ఎమోజీ క్యాప్షన్ కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications