Viral video: దూసుకొస్తోన్న వందే భారత్ కింద పడబోయి..!!
తిరువనంతపురం: కేరళలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. వృద్ధుడొకరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకోగలిగాడు. పట్టాలు దాటే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దూసుకొస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను చూసి కూడా ఈ సాహసం చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తిరువనంతపురం నుంచి కాసర్‌గాడ్‌కు వెళ్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అది. మార్గమధ్యలో తిరూర్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఆ రైలు హాల్ట్ లేదు. దీనితో వేగం ఎక్కడా తగ్గలేదు. సుమారు 110 కిలోమీటర్ల స్పీడ్‌తో అది తిరూర్ రైల్వే స్టేషన్‌ను దాటుతుంటుంది రోజూ.

ఆదివారం తిరూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటోన్న సమయంలో ఓ వృద్ధుడు పట్టాలు దాటాడు. వడివడిగా ప్లాట్ ఫామ్ నంబర్ 1ని చేరుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముందు భాగం స్టేషన్‌లో ప్రవేశించింది కూడా. దాన్ని చూసి కూడా అతను పట్టాలు దాటడానికి ప్రయత్నించాడు. సక్సెస్ అయ్యాడు.
Chacha Ke Liye 2 Shabd Pleaase !!
— Trains of India 🇮🇳 (@trainwalebhaiya) November 12, 2023
Was it his skill or Luck 😂?#VandeBharatExpress #VandeBharat pic.twitter.com/FkTrlhnSDJ
ఈ క్రమంలో రైలు అతనికి అత్యంత సమీపం నుంచి దూసుకెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. దీని తరువాత ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వారు, రైల్వే స్టేషన్ సిబ్బంది అతనికి చీవాట్లు పెట్టారు. అతణ్నిఒట్టపాళేనికి చెందిన వృద్ధుడిగా గుర్తించారు. వైద్యం కోసం వచ్చిన అతను మళ్లీ స్వగ్రామానికి వెళ్లడానికి స్టేషన్‌కు చేరుకున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications