Attack: అర్దరాత్రి బైక్ లో బయలుదేరిన దంపతులు, ఇనుపరాడ్లతో దాడి, భర్తను స్పాట్ లో చంపేశారు, భార్య ?
పంజాబ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులు నివాసం ఉంటున్న ఏరియాలోనే భర్త కుటుంబ సభ్యులు, బంధువులు నివాసం ఉంటున్నారు. రాత్రి మందులు తీసుకురావడానికి మెడికల్ షాపుకు వెళ్లిన దంపతుల మీద గుర్తు తెలియన వ్యక్తులు దాడి చేశారు. ప్రత్యర్థుల దాడిలో భర్త ప్రాణాలు పోవడంతో అతని భార్య పరిస్థితి విషమంగా ఉంది.
పంజాబ్ లోని తర్సిక్కా సమీపంలోని డెహ్రీవాల్ గ్రామంలో మంజిల్ సింగ్ (46) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు .22 సంవత్సరాల క్రితం మంజిల్ సింగ్ నరీందర్ కౌర్ (44) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న మంజిల్ సింగ్, నరీందర్ కౌర్ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు.

మంజిల్ సింగ్ అదే ప్రాంతంలో టైలర్ గా పని చేస్తున్నాడు. మంజిల్ సింగ్ నివాసం ఉంటున్న ఏరియాలోనే అతని తండ్రి స్వర్ణ సింగ్ నివాసం ఉంటున్నాడు. అర్దరాత్రి మంజిల్ సింగ్, అతని భార్య నరీందర్ సింగ్ దంపతులు మందులు తీసుకురావడానికి బైక్ లో గ్రామానికి 25 కిలో మీటరల్ దూరంలో ఉన్న పట్టణంలోని మెడికల్ షాపుకు వెళ్లారు.
మందులు తీసుకుని దంపతులు మళ్లీ బైక్ లో ఇంటికి బయలుదేరారు. మార్గం మద్యలో గుర్తు తెలియని వ్యక్తులు మంజల్ సింగ్, ననీందర్ సింగ్ మీద ఇనుపరాడ్లతో ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. ఈ దాడిలో మంజిల్ సింగ్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తీవ్రగాయాలైన మంజిల్ సింగ్ భార్య నరీందర్ సింగ్ ఆమె భర్త శవం పక్కనే కుప్పకూలిపోయింది.
మంజిల్ సింగ్ ను హత్య చేసిన తరువాత నిందితులు అక్కడి నుంచి పరారైూనారు. మంజిల్ సింగ్ భార్య నరీందర్ సింగ్ మట్టేవాల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని ఆమె పరిస్థితి విషమంగా ఉందని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు అంటున్నారు. మంజిల్ సింగ్ హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications