Wife: రాత్రి లేటుగా వస్తానని ఫోన్ చేసి చెప్పిన మహిళ, ఉదయం రోడ్డుపక్కన శవం ఉందని ఫోన్ !
బెంగళూరు/రామనగర: బందువు అయిన యువకుడిని ఓ యువతి పెళ్లి చేసుకుంది. దంపతులు అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. వివాహం జరిగి 14 ఏళ్లు అవుతున్నా దంపతులకు పిల్లలు పుట్టలేదు. భార్య కల్యాణమండపంలో పని చేస్తోంది. రాత్రి తనకు కల్యాణమండపంలో పని ఉందని, లేటుగా ఇంటికి వస్తానని అక్కకు, భర్తకు ఫోన్ చేసి చెప్పింది. పనిపూర్తి అయిన తరువాత భార్య ఇంటికి వస్తుందని భర్త అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తెలిసిన వ్యక్తి భర్తకు ఫోన్ చేసి నీ భార్యను ఎవరో చంపేసి శవం రోడ్డు పక్కన విపిరేశారని చెప్పడంతో హడలిపోయాడు. కల్యాణమండపం దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.

దంపతులు హ్యాపీ
బెంగళూరు సమీపంలోని కనకపురలోని కురుపేటలో శృతి(32) అనే మహిళ నివాసం ఉంటున్నది. లోకేష్ అనే వ్యక్తిని శృతి పెళ్లి చేసుకుంది. శృతి, లోకేష్ దంపతులు అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. వివాహం జరిగి 14 ఏళ్లు అవుతున్నా శృతి, లోకేష్ దంపతులకు పిల్లలు పుట్టలేదు. శృతి కనకపురలోని ఓ కల్యాణమండపంలో పని చేస్తోంది.

పని ఉందని ఫోన్ చేసిన మహిళ
రాత్రి శృతి తన అక్కకు ఫోన్ చేసింది. తనకు కల్యాణమండపంలో పని ఉందని, ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పింది. భర్త లోకేష్ కు కూడా ఫోన్ చేసి అదేమాట చెప్పింది. రాత్రి ఎంత సేపటికి శృతి ఇంటికి తిరిగి ఇంటికి రాలేదు. ఉదయం నిద్ర లేచే సమయానికి శృతి హత్యకు గురైందని ఫోన్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.

ఆటో రబ్బర్ వైర్ తో హత్య
రామనగర్ జిల్లాలోని కనకపుర తాలూకాలోని మారన్నదొడ్డి గ్రామ సమీపంలో శృతిని అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేశారు. రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా తెలిసిన వ్యక్తి తన సొంత ఆటోలో శృతిని పిలుచుకుని వెళ్లి కనకపుర నుంచి మారన్నదొడ్డి గ్రామానికి వెళ్లి అక్కడ ఆటోకు ఉన్న రబ్బరు వైరుతో ఆమె గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని మార్గంమధ్యలో పడేసి పరారయ్యాడు. శవం పక్కన ఆటో రబ్బర్ వైర్ కూడా పడి ఉండటంతో దానిని స్వాధీనం చేసుకున్న సాతనూరు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

సీసీకెమెరాల్లో ?
వివాహిత మహిళ శృతి హత్య కలకలం రేపుతోంది. శృతి చూడటానికి చాలా అందంగా ఉండటం, ఆమె భర్త లోకేష్ మేస్త్రీగా పని చేస్తుండటం పలు అనుమానాలకు దారితీస్తోందని పోలీసులు అంటున్నారు. శృతి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. శృతిని రాత్రి కల్యాణపండపం నుంచి ఎవరు పిలుచుకుని వెళ్లారు ? అని అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించి ఆధారాలు సేకరించారు, సాతనూరు పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. హత్యకు గురైన మహిళకు చాలా బాగా తెలిసిన వ్యక్తి రాత్రి కల్యాణమండపం దగ్గరకు వెళ్లి ఆమెను పిలుచుకుని వెళ్లాడని పోలీససులు ఆధారాలు సేకరించారు. పక్కాప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేసి సాక్షాలు చిక్కకూడదని హంతకుడు ప్రయత్నించాడని పోలీసులు అంటున్నారు. ఆటో డ్రైవర్ మాత్రమే హత్య చేశాడా ?, హత్యకు ఇంకా ఎవరైనా షహకరించారా అని కనకపుర పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేేేేశారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications