డ్రగ్స్ కు బానిసైన మైనర్ బాలుడు; ఒళ్ళు గగుర్పొడిచేలా తల్లిదండ్రులను గొడ్డలితో నరికిచంపిన దారుణం

మాదకద్రవ్యాల మత్తుకు అలవాటు పడిన ఓ బాలుడు విచక్షణను కోల్పోయాడు. నవమాసాలు మోసి కన్న తల్లిని, గుండెల మీద ఆడించి పెంచిన తండ్రి అతి కిరాతకంగా హతమార్చారు. డ్రగ్స్ కు బానిసై కానీ ఏం చేస్తున్నాడో తెలియని ఉన్మాదంతో ప్రవర్తించాడు. కొడుకు డ్రగ్స్ కు బానిస అయ్యాడు అని తెలుసుకున్న తల్లిదండ్రులు, అతనిని డీ-అడిక్షన్ సెంటర్లో చేర్చడంతో తట్టుకోలేకపోయిన 16 ఏళ్ల బాలుడు ఎవరూ ఊహించని ఘాతుకానికి పాల్పడ్డాడు.

తల్లిదండ్రులను గొడ్డలితో నరికి చంపిన మైనర్ బాలుడు

తల్లిదండ్రులను గొడ్డలితో నరికి చంపిన మైనర్ బాలుడు

రాజస్థాన్‌లో 16 ఏళ్ల మైనర్ బాలుడు తన తల్లిదండ్రులను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. రాజస్థాన్ లోని హనుమాన్‌ఘర్ ప్రాంతంలో తల్లిదండ్రులు గొడ్డలితో నరికి హతమార్చిన మైనర్ బాలుడు అదే గొడ్డలితో తమ్ముడిపై కూడా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. తమ్ముడు కూడా మరణించాడని భావించిన నిందితుడు ఆపై అమాయకంగా ప్రవర్తిస్తూ, నిందితుడు కిషోర్ తన తల్లిదండ్రులను హత్య చేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 డ్రగ్స్ కు బానిసై దారుణ ఘటన, తమ్ముడిపైనా దాడి, పరిస్థితి విషమం

డ్రగ్స్ కు బానిసై దారుణ ఘటన, తమ్ముడిపైనా దాడి, పరిస్థితి విషమం


కిషోర్ అనే 16 ఏళ్ల మైనర్ బాలుడు డ్రగ్స్ కు అలవాటు పడి, వాటికి బానిస గా మారి తన తల్లిదండ్రులను నిద్రిస్తున్న సమయంలో చంపిన సంఘటన నోహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫెఫానా గ్రామంలో జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలుడు గొడ్డలితో దాడి చేసిన ఘటనలో తండ్రి శీష్‌పాల్, తల్లి ఇంద్రాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. ఆపై తమ్ముడిపై దృష్టి సారించిన కిషోర్ గొడ్డలితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. 14 ఏళ్ల తమ్ముడు హర్యానాలోని సిర్సాలోని ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు మైనర్ నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

 తల్లిదండ్రులను చంపి అమాయకంగా కట్టుకథ

తల్లిదండ్రులను చంపి అమాయకంగా కట్టుకథ


తల్లిదండ్రులను హత్య చేసిన తర్వాత బాలుడు తన ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని నిందితుడు పోలీసులకు తెలిపాడు. తొలుత గాయపడిన అజయ్‌ను ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఇంటికి చేరుకోగా రక్తపు మడుగులో శీష్‌పాల్, ఇంద్రాదేవి మృతదేహాలు కనిపించాయి. పోలీసుల విచారణలో మైనర్ నిందితుడు తల్లిదండ్రులను చంపినట్లు అంగీకరించాడు. తమ్ముడు పై కూడా హత్యాయత్నానికి పాల్పడినట్లుగా ఒప్పుకున్నాడు.

 డీ అడిక్షన్ సెంటర్ కు పంపుతారనే అనుమానంతో బాలుడి ఘాతుకం

డీ అడిక్షన్ సెంటర్ కు పంపుతారనే అనుమానంతో బాలుడి ఘాతుకం

నిందితుడు డ్రగ్స్‌కు బానిసైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రెండున్నర నెలల క్రితం ఓ ప్రైవేట్ డీ అడిక్షన్ సెంటర్‌లో చేరి రెండు రోజుల క్రితం తిరిగి వచ్చాడు. తల్లిదండ్రులు తనను మళ్లీ సెంటర్‌కు పంపుతారని భయపడ్డాడు మైనర్ బాలుడు. తెల్లారితే తనను డీ అడిక్షన్ సెంటర్ కు పంపుతారు అన్న అనుమానంతో ఉన్మాదిగా మారాడు. అందుకే రాత్రి నిద్రిస్తున్న వారిపై, అతని తమ్ముడిపై గొడ్డలితో దాడి చేశాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి బాలుడిని రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించారు.

కుటుంబాన్నే నాశనం చేసిన డ్రగ్స్ .. తస్మాత్ జాగ్రత్త

కుటుంబాన్నే నాశనం చేసిన డ్రగ్స్ .. తస్మాత్ జాగ్రత్త

మాదకద్రవ్యాలు ఓ కుటుంబాన్నే నాశనం చేశాయని, బాలుడిని తల్లి దండ్రులను చంపిన నేరస్తుడిగా మార్చాయని, చివరకు బాలుడి బ్రతుకును ప్రశ్నార్ధకం చేశాయని తాజా ఘటనతో అర్ధం అవుతుంది. డ్రగ్స్ కు పిల్లలు బానిసలుగా మారితే జరిగే దారుణ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని అయినా మత్తు పదార్ధాలకు పిల్లలు బానిసలుగా కాకుండా చూడాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. అందుకే తస్మాత్ జాగ్రత్త.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+