వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో విచ్చలవిడిగా లవ్‌ జిహాద్‌ కేసులు- నెలరోజుల్లో 16 ఎఫ్‌ఐఆర్‌లు, 54 అరెస్టులు

|
Google Oneindia TeluguNews

ఉత్తర్‌ప్రదేశ్‌లో మతమార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చిన యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారు విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తోంది. చట్టం అమల్లోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే యూపీ పోలీసులు 16 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 86 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 54 మందిని అరెస్టు చేశారు.

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

ఉత్తర్‌ప్రదేశ్‌లో మతమార్పిళ్ల నిరోధక చట్టం అమల్లోకి వచ్చి నెలరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా యూపీ పోలీసులు తాజా నివేదికను విడుదల చేశారు. ఇందులో సీఎం యోగీ ఆదేశాల మేరకు బలవంతపు మత మార్పిళ్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు వారు తెలిపారు. బలవంతంగా మతమార్పిళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇప్పటివరకూ 16 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఇందులో 86 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా 54 మందిని అరెస్టు చేశారు.

A month on, UP Police lodged 16 FIRs, Arrested 54 under Anti Conversion Law
మరో 31 మంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని పోలసులు తెలిపారు.

యూపీలో ప్రస్తుతం యోగీ సర్కారు నమోదుచేస్తున్న కేసులన్నీ అమ్మాయిల తరఫు కుటుంబ సభ్యులు ఇస్తున్న ఫిర్యాదుల మేరకే ఉంటడం ఇక్కడ మరో విశేషం. చాలా కేసుల్లో జనానికి ఈ కొత్త చట్టంలో పేర్కొన్న అంశాల గురించి అవగాహనే లేదని పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో తల్లితండ్రులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నట్లు వారు వెల్లడించారు. వాస్తవానికి ఈ కొత్త చట్టం ప్రకారం మతాంతర వివాహాలు చేసుకోవాలనుకునే వారు మెజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున దీనిపై కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా వీరిపై చర్యలుంటాయి.

English summary
the uttar pradesh police have lodged 16 FIRs, and arrested 54 persons under reently enforced anti conversion law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X