వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్న ముస్లీం మహిళ, చాలా సంతోషం !
బెంగళూరు/హుబ్బళి: గత 2 సంవత్సరాలుగా వినాయకుడి విగ్రహాలు తయారు చేసే బృందంలో ఓ ముస్లీం మహిళ పని చేస్తోంది. ఈ గణేష్ విగ్రహాలకు ఫైనల్ కోట్ ఇవ్వడానికి ముస్లీం మహిళ శక్తి వంచనలేకుండా పని చేస్తోంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాకముందే వినాయకుడి విగ్రహల తయారిని ప్రారంభిస్తారు. వినాయకుడి విగ్రహాల తయారీదారు నిరుపమా యాదవ్‌కు సుమన అసిస్టెంట్‌గా పనిచేస్తున్నది.
ఆభరణాల రూపకల్పన మరియు విగ్రహానికి తుది మెరుగులు దిద్దడంలో ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు పనిచేస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా సుమన్ ఇంటికి సమీపంలోని విగ్రహాల తయారీ యూనిట్‌లో పనిచేస్తున్నది. అలాగే పర్యావరణహితంగా ఉండే వినాయకుడిని తయారు చేయడంతోపాటు వివిధ రకాల గణేశుడి విగ్రహాలను తయారు చేస్తున్నారు.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడి విగ్రహాల నిషేధం తర్వాత మట్టితో వినాయకుడి విగ్రహాలు తయారీని ప్రారంభించారు. వివిధ వర్గాలకు చెందిన 6 మంది మహిళలు ఇక్కడ పనిచేస్తున్నారని, అందులో ముస్లిం వర్గానికి చెందిన ఒక మహిళ కూడా ఉన్నారని నిరుపమా యాదవ్ తెలిపారు. అలాగే ఈ రోజుల్లో నాణ్యమైన మట్టిని పొందడం చాలా కష్టం. మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలు సులువుగా అమ్ముడు పోతున్నాయని నిరుపమా యాదవ్ తెలిపారు.
అందుకే పాపులర్ అయిన 'పోర్‌బందర్ చక్ మిట్టి' మరియు వార్తాపత్రికలతో విగ్రహాలను తయారు చేయాలని అనుకున్నాను. చాక్ పౌడర్ , న్యూస్ పేపర్ కలయిక తక్కువ బరువు ఉంటుందని, పగుళ్లు రాదని నాుపమా యాదవ్ చెబుతున్నారు. ఈ విధంగా, ఈ భాగంలో కాగితం నుండి వినాయకుడిని తయారు చేసే ఏకైక సంస్థగా వీరు నిలిచారు. ప్రతి సంవత్సరం దాదాపు 500 వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తారు.
అనంతరం సుమన మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా పర్యావరణహిత వినాయకుడి విగ్రహాలు సిద్ధం చేస్తున్నామని, కుల, మత, లింగ భేదాలు లేకుండా అందరూ ఇక్కడ పని చేస్తున్నారని వారు వివరించారు. మంచి కాయక్ చేస్తున్నాను. ఇదే సమయంలో ముస్లీం మహిళ కూడా మాట్లాడుతూ, నేడు కులం, మతాల మధ్య అగాధం నెలకొని అశాంతి నెలకొందని, అటువంటి సందర్భంలో ముస్లిం సమాజానికి చెందిన తాను హిందూ సాంప్రదాయ పద్దతిలో వినాయకుడి విగ్రహాలు తయారు చెయ్యడం ఆనందంగా ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications