వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకేఒక్కడు, 201 సార్లు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘన, ఫైన్, నా బైక్ అంత విలువ చెయ్యదని !

ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఒకటి రెండు సార్లు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం సర్వసాదారణం. అయితే ఒకే వ్యక్తి తన బైక్ తో 201 సార్లు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కకుండా చుక్కలు చూపించాడు.

|
Google Oneindia TeluguNews

మైసూరు: ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఒకటి రెండు సార్లు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం సర్వసాదారణం. అయితే ఒకే వ్యక్తి తన బైక్ తో 201 సార్లు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కకుండా చుక్కలు చూపించాడు.

202 సారి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కకుండా పారిపోవడానికి ప్రయత్నించిన యువకుడిని కర్ణాటకలోని మైసూరు నగర పోలీసులు పట్టుకున్నారు. అయితే అతను బైక్ వదిలి పెట్టి నేను అపరాదరుసుం చెల్లించనని వెళ్లిపోయాడు.

మైసూరు నగరంలోని రాజీవ్ నగర్ లో రోషన్ ఆలీ బేగ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి కేఏ 55 ఇ 4785 అనే నెంబర్ ఉన్న బజాజ్ ప్లాటినా బైక్ ఉంది. ఇతను మైసూరు నరగంలోని అనేక సర్కిల్స్ సిగ్నల్స్ లో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి బైక్ నడిపాడు.

A Mysuru man violates traffic rules about 201 times!

ఆదివారం రాత్రి ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ హరీష్ కుమార్ మైసూరులోని మీర్జా సర్కిల్ లో వాహనాలు పరిశీలించారు. ఆ సందర్బంలో రోషన్ ఆలీ బేగ్ అటు వైపు వెళ్లాడు. పోలీసులు బైక్ నిలపాలని సూచించడంతో రోషన్ ఆలీ బేగ్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.

పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకున్నారు. రోషన్ ఆలీ బేగ్ బైక్ నెంబర్ ను బ్లాక్ బెర్రీలో రిజిస్టర్ చెయ్యగా పోలీసుల దిమ్మతిరిగింది. 201 సార్లు ఇతను ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించాడని వెలుగు చూసింది. రూ. 20,100 అపరాదరుసుం చెల్లించాలని పోలీసులు సూచించారు.

తన బైక్ అంత విలువ చెయ్యదని, నేను అపరాదరుసుం చెల్లించనని బైక్ అక్కడే వదిలి వెళ్లిపోయాడు. నోటీసులు జారీ చేస్తామని అప్పటికే రోషన్ ఆలీ బేగ్ అపరాదరుసుం చెల్లించకుంటే అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయిస్తామని పోలీసులు అంటున్నారు.

గతంలో మైసూరు నగరంలో ఎంబీఏ విద్యార్థి 60 సార్లు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడంతో ఇటీవలే అతని నుంచి రూ. 6,000 అపరాదరుసుం వసూలు చేశారు. అయితే కర్ణాటక చరిత్రలోనే ఒక్క వ్యక్తి 201 సార్లు ట్రాఫిక్ నియమాలు ఉల్లంచినట్లు కేసు నమోదు కావడం ఇదే మొదటి సారి.

English summary
According to some people rules are made to break! a good example for this is here. A Mysuru man violates traffic rules about 201 times!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X