షాకింగ్ వీడియో: కారు ఢీ, ఎగిరిపడ్డ యువతులు
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. స్కూటీ మీద వెళుతున్న ఇద్దరు యువతులు వేగంగా దూసుకొచ్చిన ఓ కారు భీకరంగా ఢీకొట్టింది. పక్కనుంచి వస్తున్న స్కూటీని పట్టించుకోకుండానే ఎస్‌వీయూ వాహనం దూసుకెళ్లింది.
స్కూటీ మీద ఉన్న వాళ్లిద్దరు గాలిలోకి ఎగిరిపడ్డారు. వారి స్కూటీ 100మీటర్ల దూరంలో పడిపోయింది. వారి అదృష్టం బాగుండుటంతో వెంట్రుకవాసిలో ఆ ఇద్దరు మృత్యువు నుంచి తప్పించుకున్నారు.

గాల్లోకి ఎగిరినప్పటికీ వాహనం కింద పడకపోవడంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. స్కూటీని ఢీకొట్టిన ఆ లగ్జరీ వాహనం ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్లింది.
ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించి మరిన్ని వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications