వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ కేసులో మరో ట్విస్ట్: తెర మీదికి కొత్త ధర్మాసనం: న్యాయమూర్తులు వీరే..విచారణ రేపే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం కేసును విచారించడానికి సుప్రీంకోర్టు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె తప్పుకొన్న నేపథ్యంలో.. కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి రావడం అనివార్యమైంది. తాజాగా- కొత్త ధర్మాసనం ఏర్పాటు కావడంతో షెడ్యూల్ ప్రకారమే బుధవారం మరోసారి సుప్రీంకోర్టు సమక్షానికి రానుంది ఈ కేసు.

నిర్భయ కేసులో ట్విస్ట్: అక్షయ్ సింగ్ రివ్యూ పిటీషన్ విచారణ నుంచి తప్పుకొన్న చీఫ్ జస్టిస్..!నిర్భయ కేసులో ట్విస్ట్: అక్షయ్ సింగ్ రివ్యూ పిటీషన్ విచారణ నుంచి తప్పుకొన్న చీఫ్ జస్టిస్..!

కొత్తగా ఒక్కరే..

a new bench of Supreme Court has been built for hear review petition of the convicts in the Nirbhaya gang rape case

తాజాగా ఏర్పాటైన ధర్మాసనంలో న్యాయమూర్తులు భానుమతి, అశోక్ భూషణ్, ఎస్ ఏ బొపన్నలను నియమించారు. బొపన్న మినహా.. మిగిలిన ఇద్దరూ ఇదివరకే ఏర్పాటైన బెంచ్ లో సభ్యులుగా కొనసాగారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బొబ్డె స్థానంలో బొపన్న నియమితులు అయ్యారు. ఈ బెంచ్ లో చోటు చేసుకున్న మార్పు అదొక్కటే. కొత్తగా ఏర్పాటయ్యే ధర్మాసనంలో ముగ్గురూ కొత్త న్యాయమూర్తులను నియమించవచ్చంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఈ మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి.

a new bench of Supreme Court has been built for hear review petition of the convicts in the Nirbhaya gang rape case

మంగళవారమే విచారణ చేపట్టాల్సి ఉన్నా..

లిస్టింగ్ ప్రకారం- మంగళవారమే అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఎస్ ఏ బొబ్డె, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ భానుమతిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తొలుత వాదోపవాదాలను ఆరంభించింది. ఆ వెంటనే- ఎస్ ఏ బొబ్డె జోక్యం చేసుకున్నారు. తాను రివ్యూ పిటీషన్ విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. కొత్త ధర్మాసనానికి దీన్ని బదలాయిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రానికంతా.. కొత్త ధర్మాసనం ఏర్పాటు చేశారు.

English summary
Supreme Court's bench of Justice R Bhanumathi, Justice Ashok Bhushan and Justice AS Bopanna will hear tomorrow the review petition of the convicts in the 2012 Delhi gang rape case. Chief Justice of India had recused himself from the hearing. Therefore a new bench has been built.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X