భారత చరిత్రలో కొత్త క్రిమినల్ చట్టాల అమలుతో నవయుగం మొదలు: పీఎం మోడీ!!
పార్లమెంటులో 3 క్రిమినల్ శిక్షా స్మృతి బిల్లులు ఆమోదం పొందడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో ఇది ఒక పెద్ద మార్పు అని, కొత్త పరిణామాల ప్రారంభానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ముఖ్యమైన సంఘటనగా ప్రధాని మోడీ దీనిని అభివర్ణించారు. దీనితో మన దేశంలో వలస పాలన చట్టాలకు కాలం చెల్లిందని అన్నారు.
భారత చరిత్రలో ఈ కొత్త చట్టాలు అమలుతో ప్రజా సేవా, సంక్షేమం విషయంలో నవయుగం ప్రారంభమవుతుందని అన్నారు. ట్విట్టర్ చేసిన పోస్టులో ప్రధాని నరేంద్ర మోడీ "భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023, భారతీయ న్యాయ సంహిత, 2023 మరియు భారతీయ సాక్ష్యా అధినియం, 2023 ఆమోదించడం మన చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ బిల్లులు భారతీయ శిక్షా స్మృతి స్థానంలో భారతీయ న్యాయ ( రెండవ) సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష( రెండవ) సంహిత, ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ సాక్ష( రెండవ) బిల్లు రూపాంతరం చెందుతాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సంస్కరణల పట్ల భారతదేశం యొక్క నిబద్ధతకు ఇవి నిదర్శనమని ఆయన తెలిపారు.
ఈ బిల్లులు మన సమాజంలోని పేద అట్టడుగు బలహీన వర్గాలకు మెరుగైన రక్షణను అందిస్తాయని, దేశం యొక్క శాంతియుత ప్రయాణం వైపు పురోగమనానికి ఉపయోగపడతాయని తెలిపారు. దేశద్రోహం పై రాజ్యాంగంలోని కాలం చెల్లిన సెక్షన్లకు భారతదేశం వీడ్కోలు పలుకుతుందని ప్రధాని మోడీ.
ఇదిలా వుండగా నిన్న పార్లమెంటు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధీనియం అనే 3 శిక్షా స్మృతులను ఆమోదించింది. ఈ బిల్లులు 1860 భారతీయ శిక్షా స్మృతి, 1898 క్రిమినల్ ప్రొసిజర్ స్మృతి, 1872 భారతీయ సాక్ష్యాధారాల చట్టం స్థానంలో చట్టాలుగా అమలవుతాయి. ఈ మూడు బిల్లులు చట్టాలుగా ఈ ఏడాది చివరి నాటికే అమలులోకి రానున్నాయి. ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నుండి చివరకు తీర్పు వరకు అన్నీ ఆన్ లైన్ అవుతాయి.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications